Kitchen Gadgets: నీటి బొట్టు కింద పడదిక!
వంటింట్లో నీటితోనే ఎక్కువ పని. గిన్నెలు కడగడం, కూరగాయలు-పండ్లు శుభ్రం చేయడం.. ఇలా ఎంతసేపూ సింక్, కిచెన్ ప్లాట్‌ఫామ్ చుట్టూ తిరుగుతుంటాం. ఈ క్రమంలో నీళ్లు నేలపై పడుతుంటాయి. దీంతో ఈ వర్షాకాలంలో నేల ఓ పట్టాన ఆరదు.
వంటింట్లో నీటితోనే ఎక్కువ పని. గిన్నెలు కడగడం, కూరగాయలు-పండ్లు శుభ్రం చేయడం.. ఇలా ఎంతసేపూ సింక్, కిచెన్ ప్లాట్‌ఫామ్ చుట్టూ తిరుగుతుంటాం. ఈ క్రమంలో నీళ్లు నేలపై పడుతుంటాయి. దీంతో ఈ వర్షాకాలంలో నేల ఓ పట్టాన ఆరదు. అయితే ఈ సమస్య లేకుండా ఉండాలంటే.. మనం శుభ్రం చేసే గిన్నెలు, పండ్లు, కాయగూరల్ని ప్లాట్‌ఫామ్ దాటించకుండా ఉండాలి. అదెలా అనుకుంటున్నారా? డిష్ డ్రైనర్స్/డ్రైయింగ్ ర్యాక్స్‌ని సింక్‌పై ఏర్పాటు చేసుకోవడమే!
అలాంటి డిష్ డ్రైనర్స్ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మన ఇళ్లలో శుభ్రం చేసిన పాత్రల్ని అమర్చుకోవడానికి బాస్కెట్ తరహా డిష్ డ్రైనర్స్‌ని ఉపయోగిస్తుంటాం. అయితే దీన్ని ఎక్కడ అమర్చినా.. తిరిగి పాత్రల్ని అందులో నుంచి తీసుకునేటప్పుడు ఆ ప్రాంతంలో నీళ్లు కింద పడుతుంటాయి. పైగా పాత్రలు పూర్తిగా ఆరక ముందే.. వాటిని అలాగే కిచెన్ క్యాబినెట్స్‌లో అమర్చడం వల్ల వాటిపై తుప్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కడిగిన పాత్రల్ని సులభంగా ఆరబెట్టుకోవడానికి, వాటి నుంచి నీళ్లు నేలపై పడకుండా ఉండేందుకు.. సింక్‌పై ఏర్పాటుచేసుకునే ఈ డిష్ డ్రైనర్స్ ఉపయోగపడతాయి.
ఇక వీటిలో ప్లేట్స్, గిన్నెలు, పెద్ద పెద్ద పాత్రలు, గాజు వస్తువులు, కట్టర్స్, స్పూన్లు.. ఇలా విడివిడిగా అమర్చుకోవడానికి ప్రత్యేకమైన ర్యాక్స్ ఉంటాయి. ఈ డ్రైనర్స్‌లోనూ సింక్‌పై నేరుగా ఫిక్స్ చేసుకునేలా లేదంటే అక్కడే గోడకు అమర్చుకునేలా ఉన్నవీ దొరుకుతున్నాయి. ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్, వాటర్‌ప్రూఫ్ చెక్కతో తయారుచేసినవి.. ఇలా విభిన్న మెటీరియల్స్‌తో రూపొందించినవీ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అలాంటి డిష్ డ్రైనర్సే ఇవి!
Photos: Amazon.in
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.