Published : 08/10/2022 18:19 IST

కలయికకు దూరం.. వైట్ డిశ్చార్జి.. ఎందుకిలా?

నాకు పెళ్లై నాలుగేళ్లవుతోంది. పిల్లల కోసం ఇంకా ప్లాన్‌ చేసుకోలేదు. గత ఆరు నెలలుగా నాకు విపరీతంగా వైట్‌ డిశ్చార్జి అవుతోంది. పిరియడ్స్‌ సమయంలో పొత్తి కడుపులో నొప్పి వస్తోందని Meftal Spas వాడాను. పని ఒత్తిడితో ఆరు నెలలుగా కలయికకు దూరంగా ఉన్నా.. నాకు వైట్‌ డిశ్చార్జి ఎందుకు అవుతోందో అర్థం కావట్లేదు? అలాగే పొత్తి కడుపులో నొప్పి తగ్గాలంటే నేనేం చేయాలి?- ఓ సోదరి

జ: మీకు వైట్‌ డిశ్చార్జి విపరీతంగా అవుతోందంటే కారణం తెలుసుకోవడానికి ఓసారి గైనకాలజిస్ట్‌తో పరీక్షలు చేయించుకోవాలి. వైట్‌ డిశ్చార్జి పలుచగా ఉందా? చిక్కగా ఉందా?మీగడ తరకల్లాగా ఉందా? దాంతో పాటు దురద, దుర్వాసన కూడా ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకుంటే కొంత వరకు సమస్య అర్థమవుతుంది. పూర్తిగా అర్థం కావాలంటే కొన్ని పరీక్షలు చేసి చూడాలి. ఎందుకంటే వైట్‌ డిశ్చార్జికి చాలా రకాల కారణాలుంటాయి. ఇన్ఫెక్షన్‌కి సంబంధించిందైతే ఇన్ఫెక్షన్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌, ప్యారసైట్స్‌.. వీటిలో దేనివల్లో తెలుసుకొని చికిత్స చేస్తే త్వరగా నయమవుతుంది. అలాగే పాప్‌స్మియర్‌, హెచ్‌పీవీ పరీక్షలు కూడా చేయించుకోవాలి. మీకు డయాబెటిస్‌ లేదని నిర్ధారించుకోవాలి. ఇక పొత్తి కడుపులో నొప్పి దీనికి సంబంధించింది కావచ్చు.. లేదంటే వేరే సమస్య వల్ల కూడా వస్తుండచ్చు. అందుకే దాని కోసం అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ కూడా చేసి చూడాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని