Published : 25/08/2021 15:26 IST

నార్మల్‌ డెలివరీ కావాలంటే ఏం చేయాలి?

నమస్తే డాక్టర్‌ గారు.. నా పేరు శ్రావ్య. నేను ఏడో నెల గర్భవతిని. నాకు సిజేరియన్‌ అంటే ఇష్టం లేదు. నార్మల్‌ డెలివరీ కోసం ఏం చేయాలో తెలుపగలరు.

- ఓ సోదరి

జ. నార్మల్‌ డెలివరీ కావాలనుకోవడం మంచి ఆలోచన. సాధారణంగా ఏ డాక్టర్ అయినా అనవసరంగా సిజేరియన్‌ చేయరు. తల్లికి కానీ, బిడ్డకు కానీ ఏదైన సమస్య వచ్చినప్పుడు సిజేరియన్‌ చేస్తుంటారు. మీరు ‘నాకు సిజేరియన్‌ అంటే ఇష్టం లేదు’ అనే భావనను మనసులో నుంచి తీసేయండి. ఒకవేళ నార్మల్‌ డెలివరీనే అవుతుందని మీరు నమ్మకంతో ఉన్నా బేబీకి ఏదైనా సమస్య వచ్చి సి-సెక్షన్ చేయాల్సి వస్తే అదే మీ మనసులో పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు సిజేరియన్‌ చేయాల్సి రావచ్చు.

ఇక నార్మల్‌ డెలివరీ కావాలంటే మీ వైపు నుంచి చక్కని ఆహారం తీసుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అలాగే డెలివరీకి ముందు కూడా కొన్ని రకాల నొప్పులు వస్తుంటాయి. అవన్నీ ప్రసవ నొప్పులు కావు. కాబట్టి మీరు డెలివరీ చివరి తేదీ (40 వారాలు) వరకు వేచి చూడండి. దానివల్ల నార్మల్‌ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏడో నెల గర్భిణి కాబట్టి కొత్తగా ఎలాంటి వ్యాయామాలు ప్రయత్నించకండి. ఒకవేళ ఇంతకుముందు నుంచి ఏవైనా వ్యాయామాలు చేస్తున్నట్లయితే వాటిని కొనసాగించండి. అయితే వాకింగ్‌ మాత్రం ఎప్పుడైనా చేయచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పిండం ఎదుగుల సంతృప్తికరంగా ఉంటే వాకింగ్‌ని చివరి వరకు కొనసాగించవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్