ఒకటే ఫాలోపియన్ ట్యూబ్.. సహజంగా గర్భం వస్తుందా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 28. పెళ్లై మూడున్నరేళ్లైంది. ఈమధ్యే ల్యాప్రోస్కోపీ చేయించుకున్నా. ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే అండాశయాన్ని సంరక్షించేందుకు డాక్టర్లు నా ఎడమ ఫాలోపియన్‌ ట్యూబ్‌ను తొలగించారు. ప్రస్తుతం కుడి అండాశయంలో 4 cm సిస్టు ఉంది.. ఇందుకోసం మందులు వాడుతున్నాను.

Updated : 29 Feb 2024 16:46 IST

నమస్తే డాక్టర్‌. నా వయసు 28. పెళ్లై మూడున్నరేళ్లైంది. ఈమధ్యే ల్యాప్రోస్కోపీ చేయించుకున్నా. ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే అండాశయాన్ని సంరక్షించేందుకు డాక్టర్లు నా ఎడమ ఫాలోపియన్‌ ట్యూబ్‌ను తొలగించారు. ప్రస్తుతం కుడి అండాశయంలో 4 cm సిస్టు ఉంది.. ఇందుకోసం మందులు వాడుతున్నాను. ఇలాంటి పరిస్థితిలో నేను సహజంగా గర్భం ధరించే అవకాశాలున్నాయా? అండం ఆరోగ్యం కోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- ఓ సోదరి

జ: మీకు ఈ మధ్య ల్యాప్రోస్కోపీ చేశారని రాశారు. అయితే ఇది ఎందుకోసం చేశారో రాయలేదు. బహుశా సంతానలేమి కోసమే చేసుండచ్చు. అయితే ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ రావడం వల్ల మీకు ఒక ఫాలోపియన్‌ ట్యూబ్‌ను తీసేశారు కాబట్టి కుడివైపు ఫాలోపియన్‌ ట్యూబ్‌ ఒక్కటే ఉంది. కుడివైపు అండాశయంలో సిస్టు కోసం మందులు వాడుతున్నారని రాశారు. ఒక రెండు మూడు నెలలు వాడిన తర్వాత తిరిగి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయించుకొని సిస్టు తగ్గిందో, లేదో చూసుకోవాలి. మీకు ఒకవైపు ఫాలోపియన్‌ ట్యూబ్‌ లేకపోవడం వల్ల మీరు సహజంగా గర్భం ధరించే అవకాశాలు తగ్గుతాయి. అయినా ఒక ఆరు నెలలు ప్రయత్నించి చూస్తే తప్ప గర్భం నిలుస్తుందా? లేదా? అన్నది చెప్పలేం. ఆ తర్వాత కూడా రాకపోతే డాక్టర్‌ని సంప్రదించడం తప్పనిసరి. అలాగే అండం ఆరోగ్యం కోసం మంచి జీవనశైలి, బరువును అదుపులో ఉంచుకోవడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం.. ఇవన్నీ దోహదం చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్