సురక్షితమైన గర్భనిరోధక పద్ధతులేవి?

హలో మేడం. మాకు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. మరో మూడేళ్ల పాటు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఎలాంటి దుష్ర్పభావాలు లేని గర్భనిరోధక పద్ధతులేవైనా....

Published : 03 Sep 2022 17:49 IST

హలో మేడం. మాకు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. మరో మూడేళ్ల పాటు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఎలాంటి దుష్ర్పభావాలు లేని గర్భనిరోధక పద్ధతులేవైనా ఉంటే చెప్పగలరు. - ఓ సోదరి

జ: మీరు మూడేళ్ల పాటు పిల్లలు వద్దని అనుకుంటున్నారు. అందుకోసం ఎలాంటి దుష్ప్రభావాలు లేని పద్ధతులంటే.. మీరు ఒకసారి డాక్టర్‌ని కలిసి వివరంగా చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన పద్ధతి సరిపడకపోవచ్చు. మీ కుటుంబ చరిత్ర, మీ ఆరోగ్యం, మీకున్న ఇతర అలవాట్లు, లక్షణాలు.. వంటివన్నీ పరిశీలించి మీకు ఏది క్షేమమో డాక్టర్లే నిర్ణయిస్తారు. ఏదేమైనా డబ్ల్యూహెచ్‌వో వారి సూచనల ప్రకారం.. ఎలాంటి గర్భనిరోధక పద్ధతైనా సరే.. అవాంఛిత గర్భం రావడం కంటే ఎన్నో రెట్లు క్షేమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్