మందులు వాడకున్నా ఫాలికల్స్ కరిగిపోతాయా?

నమస్తే మేడం. నా వయసు 28. బరువు 56 కిలోలు. ఇంకా పెళ్లి కాలేదు. నాకు నడుంనొప్పి సమస్య ఉంటే డాక్టర్ సలహా మేరకు ఇటీవలే అబ్డామిన్ స్కాన్ చేయించుకున్నాను. రిపోర్ట్‌లో (Both ovaries normal in size with multiple.....

Published : 16 Apr 2022 18:35 IST

నమస్తే మేడం. నా వయసు 28. బరువు 56 కిలోలు. ఇంకా పెళ్లి కాలేదు. నాకు నడుంనొప్పి సమస్య ఉంటే డాక్టర్ సలహా మేరకు ఇటీవలే అబ్డామిన్ స్కాన్ చేయించుకున్నాను. రిపోర్ట్‌లో (Both ovaries normal in size with multiple small peripherally arranged follicles. 19*16mm size small functional cysts noted in left ovary. polycystic appearing ovaries) అని వచ్చింది. నడుంనొప్పికి క్యాల్షియం ట్యాబ్లెట్స్ రాశారు.. కానీ ఫాలికల్స్ వాటంతటవే కరిగిపోతాయని డాక్టర్ ట్యాబ్లెట్స్ ఏమీ ఇవ్వలేదు. నాకు పిరియడ్స్ కూడా రెగ్యులర్‌గానే వస్తాయి. మందులు వాడకున్నా ఫాలికల్స్ కరిగిపోతాయా? వీటి వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందా? దయచేసి తెలుపగలరు. - ఓ సోదరి

జ: మీరు అబ్డామిన్ స్కాన్ రిపోర్టు చూసి పీసీఓఎస్ ఉందని భయపడుతున్నారు. కానీ మీరు నిజంగా పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారా? లేదా? అని నిర్ధరించుకోవాలంటే స్కానింగ్‌తో పాటు వివిధ హార్మోన్ల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్టులన్నీ చూసిన తర్వాతే మీకు నిజంగా పీసీఓఎస్ ఉన్నదీ, లేనిదీ నిర్ధరించగలుగుతాం. సాధారణంగా మీకు నెలసరి రెగ్యులర్‌గా వస్తున్నప్పుడు ప్రత్యేకంగా మందులు వాడాల్సిన అవసరం ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్