గర్భం నిలిచినా తల్లిని కాలేకపోతున్నా.. కారణమేమిటి?
హాయ్ డాక్టర్. నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. ఒకసారి అబార్షన్ అయింది. రెండోసారి ఎనిమిదో నెలలో బేబీ పుట్టి చనిపోయింది. మూడోసారీ అలాగే అయింది. ఇప్పుడు నేను మళ్లీ ప్రెగ్నెంట్. వైట్ డిశ్చార్జి, దురద.. వంటి సమస్యలున్నాయి. దీనికి పరిష్కారం చెప్పండి.. నేను తల్లినవుతానా?
హాయ్ డాక్టర్. నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. ఒకసారి అబార్షన్ అయింది. రెండోసారి ఎనిమిదో నెలలో బేబీ పుట్టి చనిపోయింది. మూడోసారీ అలాగే అయింది. ఇప్పుడు నేను మళ్లీ ప్రెగ్నెంట్. వైట్ డిశ్చార్జి, దురద.. వంటి సమస్యలున్నాయి. దీనికి పరిష్కారం చెప్పండి.. నేను తల్లినవుతానా?
- ఓ సోదరి
జ: మీరు రెండు సమస్యల గురించి రాశారు.
మొదటిది - మూడుసార్లు గర్భం నిలిచినా బిడ్డ చేతికి రాకపోవడం. ఇలా జరిగినప్పుడు సాధారణంగా మేమిచ్చే సలహా ఏంటంటే.. తిరిగి గర్భం ధరించడానికి ముందుగానే అసలు కారణమేంటో తెలుసుకోవడానికి వివరంగా పరీక్షలు చేయించుకొని.. దానికి అవసరమైన చికిత్స తీసుకున్న తర్వాతే బేబీ కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది. గర్భాశయం ఆకృతిలో లోపాలుండడం లేదా హార్మోన్ల పరంగా గానీ, ఇతరత్రా వైద్య సమస్యలు గానీ లేదా వ్యాధి నిరోధక వ్యవస్థలో లోపాలు గానీ.. వీటిలో ఏవి ఉన్నా మీరు చెప్పినట్లుగా జరగచ్చు. అయితే మీరు ఇప్పటికే గర్భిణి కాబట్టి ప్రస్తుతానికి ఒక మంచి హై రిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్‌లో చూపించుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
ఇక మీ రెండో సమస్య - వైట్ డిశ్చార్జి, దురద అంటున్నారు.. సాధారణంగా గర్భవతిగా ఉన్నప్పుడు పీహెచ్‌లో మార్పుల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. మీరు చికిత్స తీసుకుంటున్న చోట డాక్టర్‌కి చెప్తే వారొక్కసారి పరీక్ష చేసి చూసి ఇన్ఫెక్షన్ కోసం మందులిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.