నెలసరి సమయంలో ఈ సమస్య సహజమేనా?

హాయ్‌ డాక్టర్‌.. నెలసరి వచ్చే నాలుగు రోజుల ముందు నుంచి రెండు కాళ్లు విపరీతంగా లాగుతున్నాయి.. తిమ్మిరిగా ఉంటున్నాయి. పిరియడ్స్‌ సమయంలో కూడా ఈ సమస్య వేధిస్తోంది. దీన్నుంచి బయటపడే మార్గం చెప్పండి.

Published : 02 Nov 2021 18:38 IST

హాయ్‌ డాక్టర్‌.. నెలసరి వచ్చే నాలుగు రోజుల ముందు నుంచి రెండు కాళ్లు విపరీతంగా లాగుతున్నాయి.. తిమ్మిరిగా ఉంటున్నాయి. పిరియడ్స్‌ సమయంలో కూడా ఈ సమస్య వేధిస్తోంది. దీన్నుంచి బయటపడే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

జ: కొన్ని కొన్ని సమస్యలు నెలసరి సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల అప్పుడే తీవ్రంగా కనిపిస్తాయి. ఒక్కోసారి విటమిన్‌ డి, విటమిన్‌ బి12, క్యాల్షియం లోపాలున్నా ఇలా జరగచ్చు. లేదా గర్భాశయానికి, అండాశయాలకు సంబంధించిన సమస్యలున్నా కూడా కటి వలయంలో పెల్విక్‌ కంజెషన్ వల్ల ఇలాంటి సమస్యలు రావచ్చు. మొట్టమొదటగా విటమిన్‌ లోపాలు, క్యాల్షియం లోపం గనుక ఉంటే వాటి గురించి శ్రద్ధ తీసుకోవాలి. కాళ్లలో రక్తప్రసరణ మెరుగవడానికి వ్యాయామం చేయాలి. అయినా తగ్గకపోతే మాత్రం ఓసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్