Published : 12/07/2022 20:09 IST

ఇద్దరికీ సమస్యలు.. పిల్లలు పుడతారా?

నమస్తే మేడమ్.. నాకు ౨౩ ఏళ్లు. ఎత్తు 5’4’’. నాకు నాలుగేళ్లుగా పీసీఓఎస్‌ ఉంది. మందులు వాడుతున్నా. మా వారికి స్పెర్మ్‌ స్పీడ్‌ తక్కువగా ఉందన్నారు డాక్టర్లు. మరి, మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

జ: మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు పీసీఓఎస్‌ వల్లే అండం విడుదల కావట్లేదు. అలాగే మీ వారికి స్పెర్మ్‌ కదలిక తక్కువగా ఉంది. కాబట్టి రెండు వైపుల నుంచి సమస్యలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఓవైపు మీకు అండం విడుదలవడానికి మందులు వాడుతూ.. మరోవైపు ఐయూఐ కొద్ది నెలల పాటు ప్రయత్నించి చూడచ్చు. మీ వారు కూడా ఆండ్రాలజిస్ట్‌ని సంప్రదించి స్పెర్మ్‌ కదలిక మెరుగుపడడానికి మందులు వాడితే ఫలితాలు మెరుగ్గా ఉండచ్చు.
 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని