స్పెర్మ్ కదలిక తక్కువుంటే.. పిల్లలు పుడతారా?
నమస్తే మేడమ్.. నాకు ౨౩ ఏళ్లు. ఎత్తు 5’4’’. నాకు నాలుగేళ్లుగా పీసీఓఎస్ ఉంది. మందులు వాడుతున్నా. మా వారికి స్పెర్మ్ స్పీడ్ తక్కువగా ఉందన్నారు డాక్టర్లు. మరి, మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా?
నమస్తే మేడమ్.. నాకు ౨౩ ఏళ్లు. ఎత్తు 5’4’’. నాకు నాలుగేళ్లుగా పీసీఓఎస్ ఉంది. మందులు వాడుతున్నా. మా వారికి స్పెర్మ్ స్పీడ్ తక్కువగా ఉందన్నారు డాక్టర్లు. మరి, మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి
జ: మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు పీసీఓఎస్ వల్లే అండం విడుదల కావట్లేదు. అలాగే మీ వారికి స్పెర్మ్ కదలిక తక్కువగా ఉంది. కాబట్టి ఇద్దరి వైపు నుంచి సమస్యలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఓ పక్క మీకు అండం విడుదలవడానికి మందులు వాడుతూ.. మరో పక్క ఐయూఐ కొద్ది నెలల పాటు ప్రయత్నించి చూడచ్చు. మీ వారు కూడా ఆండ్రాలజిస్ట్‌ని సంప్రదించి స్పెర్మ్ కదలిక మెరుగుపడడానికి మందులు వాడితే ఫలితాలు మెరుగ్గా ఉండచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.