అప్పుడు అబార్షన్ అయింది.. మళ్లీ గర్భం రాలేదు.. ఏం చేయాలి?

నమస్తే డాక్టర్‌. నా వయసు 25. బరువు 49 కిలోలు. నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. పెళ్లైన తొమ్మిది నెలలకు గర్భం దాల్చాను. అయితే ఆ తర్వాత అబార్షన్‌ అయింది. ఇప్పటిదాకా మళ్లీ.....

Published : 12 May 2022 16:06 IST

నమస్తే డాక్టర్‌. నా వయసు 25. బరువు 49 కిలోలు. నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. పెళ్లైన తొమ్మిది నెలలకు గర్భం దాల్చాను. అయితే ఆ తర్వాత అబార్షన్‌ అయింది. ఇప్పటిదాకా మళ్లీ ప్రెగ్నెన్సీ రాలేదు. నాకు థైరాయిడ్‌ ఉంది. ప్రస్తుతం 12.5 ఎంసీజీ మాత్రలు వాడుతున్నా. నాకు పిల్లలు పుట్టే మార్గం చెప్పండి. - ఓ సోదరి

జ: మీకు ఈ ఆరేళ్లలోనూ మొట్టమొదట అయిన గర్భస్రావం తప్ప తిరిగి గర్భం రాలేదంటున్నారు. అంటే మీరు వివరంగా పరీక్షలన్నీ చేయించుకోవాలి. గైనకాలజిస్ట్‌ దగ్గరికి వెళ్తే జననేంద్రియాల ఆరోగ్యం గురించి, గర్భాశయం, అండాశయాలు, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ పరిస్థితి గురించి, మీ హార్మోన్ల స్థాయుల గురించి వివరంగా పరీక్షలు చేసి చూస్తారు. అలాగే మీ వారికి సెమెన్‌ అనాలిసిస్‌ పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ఫలితాలను బట్టే మీరు ఎలాంటి చికిత్స తీసుకుంటే గర్భం నిలుస్తుందో అర్థమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్