రెండు నెలలుగా నెలసరి రావట్లేదు.. ఆ మందులు వాడచ్చా?

హాయ్‌ మేడమ్‌. నాకు గత రెండు నెలల నుంచి పిరియడ్స్‌ రావట్లేదు. దాంతో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటే నెగెటివ్‌ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మూత్రంలో రక్తం కనిపించింది. డాక్టర్‌ని సంప్రదిస్తే మరోసారి హోమ్‌ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకోమన్నారు. అప్పటికీ నెగెటివ్‌ వస్తే పిరియడ్స్ రావడానికి....

Published : 14 May 2022 18:35 IST

హాయ్‌ మేడమ్‌. నాకు గత రెండు నెలల నుంచి పిరియడ్స్‌ రావట్లేదు. దాంతో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటే నెగెటివ్‌ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మూత్రంలో రక్తం కనిపించింది. డాక్టర్‌ని సంప్రదిస్తే మరోసారి హోమ్‌ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకోమన్నారు. అప్పటికీ నెగెటివ్‌ వస్తే పిరియడ్స్ రావడానికి మందులు వేసుకోమన్నారు. ఈ సమయంలో అవి వేసుకోవడం సరైందేనా? ఇతర పరీక్షలేమైనా చేయించుకోవాలా? చెప్పండి. - ఓ సోదరి

జ: మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌ రెండుసార్లు నెగెటివ్‌ వచ్చింది కనుక ప్రస్తుతం పిరియడ్స్ రావడానికి మీ డాక్టర్‌ మందులు వేసుకోమన్నారు. అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే! కానీ తరచూ ఇలాగే అవుతుంటే మాత్రం తప్పనిసరిగా కారణం తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటిలో అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్ల పరీక్షలు ముఖ్యమైనవి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్