ఇరవై దాటినా రజస్వల కాలేదు.. ఎందుకని?

హాయ్‌ మేడమ్‌. నాకు 22 ఏళ్లు. ఇంకా మెచ్యూర్‌ కాలేదు. డాక్టర్‌కి చూపించుకుంటే స్కాన్‌ చేసి ‘అండంలో పెరుగుదల లేదు.. దాని చుట్టూ కొవ్వు లాంటి పొర ఉంది’ అన్నారు. నా సమస్యకు పరిష్కారమేంటి? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

Published : 15 Mar 2022 19:43 IST

హాయ్‌ మేడమ్‌. నాకు 22 ఏళ్లు. ఇంకా మెచ్యూర్‌ కాలేదు. డాక్టర్‌కి చూపించుకుంటే స్కాన్‌ చేసి ‘అండంలో పెరుగుదల లేదు.. దాని చుట్టూ కొవ్వు లాంటి పొర ఉంది’ అన్నారు. నా సమస్యకు పరిష్కారమేంటి? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

జ: మీ పరిస్థితిని ప్రైమరీ అమెనోరియా అంటారు. దీనికి కారణాలు మీ జన్యువుల్లో లేదా హార్మోన్లలో లేదా మీ జననేంద్రియాల్లో ఉండచ్చు. కాబట్టి అసలు కారణమేంటో తెలుసుకోవడానికి అనుభవజ్ఞురాలైన గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే ఈ పరీక్షలన్నీ చేసి మీకు సలహా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీ నెలసరి గురించే కాకుండా ముందు ముందు పెళ్లి-పిల్లల గురించిన విషయాలు కూడా మీరు డాక్టర్‌తో చర్చించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్