Updated : 13/01/2023 02:57 IST

చీరకో నగ చమక్కనిపిస్తుంది!

పండగ అనగానే అమ్మాయిలకు పట్టు చీరలూ, వాటికి నప్పే నగలూ ఠక్కున గుర్తొస్తాయి. మరి ఈ సంక్రాంతి పండక్కి మీరేం ఎంచుకుంటున్నారు అంటే మాత్రం... బోలెడు సందిగ్ధత. అలాంటివారి కోసమే ఈ చిట్కాలు.

ధగధగలాడే పట్టు చీర కట్టి...కనీ కనిపించని గొలుసు మెడలో వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? వన్‌గ్రామ్‌ గోల్డ్‌లో టెంపుల్‌ స్టైల్‌ మామిడి పిందెలహారమో, మహారాణీ హారమో, లక్ష్మీ నెక్లెస్‌నో ఎంచుకోండి. రూబీ, పచ్చలూ, రైస్‌పెరల్స్‌ వంటివి జతైతే మరింత నిండుగా కనిపిస్తారు. వీటికి మ్యాచింగ్‌గా కాస్త పెద్ద పరిమాణంలో బుట్టలూ, చేతికి నక్షీ డిజైనర్‌ గాజులూ మెప్పిస్తాయి.


మేం కాస్త సింపుల్‌గా కనిపించాలనుకుంటున్నాం అంటారా? చిన్న అంచూ, ప్లెయిన్‌ రంగుల్లో దుస్తులు ఎంచుకున్నప్పుడు అమెరికన్‌ డైమండ్స్‌తో చేసిన మ్యాచింగ్‌ బీడ్స్‌ చోకర్‌ ఒకటి పెట్టుకోండి చాలు. మీ లుక్‌ అదిరిపోతుంది. 


ఆర్ట్‌ సిల్క్‌, ఆర్గాంజా వంటివి ఎంచుకున్నప్పుడు సిల్వర్‌ జ్యూయలరీని ప్రయత్నించండి. వీటిల్లోనూ రూబీ, ఎమరాల్డ్స్‌ వంటివాటితో తయారు చేసిన టెంపుల్‌ డిజైన్‌ రకాలున్నాయి. మీ చీరని బట్టి జత చేసుకోండి.


లాంగ్‌గౌన్‌లూ, అనార్కలీలూ వేసుకుంటాం అనుకునేవారు పాతకాలం నాటి బిళ్లల నెక్లెస్‌ని ఎంచుకోవచ్చు. లేదంటే...సింపుల్‌ పెండెంట్‌ గొలుసులూ వేసుకోవచ్చు. ఈ రెంటికీ జతగా చాంద్‌బాలీలు బాగుంటాయి.


జకార్డ్‌ పనితనంతో చేసిన బెనారాస్‌ తరహా చీరల్ని కట్టుకున్నప్పుడు ఎమరాల్డ్‌, పెరల్స్‌తో చేసిన రకాలు హుందాతనాన్ని తెచ్చిపెడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని