కూరలో ఉప్పెక్కువైందా?

టైం అయిపోతోందనే కంగారు వల్లో లేక మతిమరుపు వల్లో కొందరు కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తూ ఉంటారు. సాధారణంగా కూరలో ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. కానీ ఎక్కువైన ఉప్పుని తగ్గించడం....

Published : 06 Jul 2023 21:26 IST

టైం అయిపోతోందనే కంగారు వల్లో లేక మతిమరుపు వల్లో కొందరు కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తూ ఉంటారు. సాధారణంగా కూరలో ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. కానీ ఎక్కువైన ఉప్పుని తగ్గించడం ఎలాగో మీకు తెలుసా? అదెలాగో చూద్దాం రండి..

కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు దానికి కొద్దిగా కొబ్బరిపాలు జత చేయాలి. ఇలా చేయడం వల్ల కూరలో ఉప్పదనం తగ్గి రుచిగా ఉంటుంది.

ఒక బంగాళాదుంప తీసుకుని ఒవెన్‌లో 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తర్వాత తొక్క తీసేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. 4 నుంచి 5 నిమిషాల పాటు వాటిని అందులో ఉంచడం వల్ల ఎక్కువైన ఉప్పుని ఇవి గ్రహించేస్తాయి.

ఒకవేళ ఒవెన్ లేకపోతే పచ్చి బంగాళదుంపనే తొక్క చెక్కేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. వీటిని దాదాపు 10 నిమిషాల పాటు అందులో ఉడకనిస్తే సరి. అయితే వడ్డించే ముందు మాత్రం వీటిని కూరలోంచి బయటకు తీసేయడం మరచిపోవద్దు.

2 లేదా 3 చెంచాల పెరుగు కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు.. రుచి కూడా పెరుగుతుంది.

పెరుగు వేయడం ఇష్టం లేని వారు దానికి బదులుగా కొద్దిగా మీగడని కూడా ఉపయోగించవచ్చు.

మీరు వండుతున్న కూరలో ఉల్లిపాయ, టొమాటో.. రెండూ కలిపి ముద్దగా చేసి ఆ కూరకు జత చేయచ్చు. ఇలా చేయడం వల్ల కూరలో ఉన్న ఉప్పు తగ్గడమే కాకుండా రుచికరంగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది.

ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నూనెలో వేయించి కూరకు జత చేసుకుంటే రుచికి రుచి, ఉప్పదనం కూడా తగ్గుతుంది.

గోధుమ పిండికి కొద్దిగా నీటిని జత చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని కూరలో వేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయచ్చు.

ఒకవేళ కూరలో తక్కువ నీళ్లు ఉంటే కనుక మరికొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించినా ఫలితం ఉంటుంది.

కూరలో ఉప్పు తగ్గడంతో పాటు రుచికరంగా కూడా మారాలనుకుంటే మాత్రం అందులో పాలు పోస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్