మురిపించే ముత్యాల ముగ్గులతో.. ఆకట్టుకునే బహుమతులు!

సరదాల సంక్రాంతిని పురస్కరించుకుని 'ఈనాడు వసుంధర' ఆన్‌లైన్ రంగవల్లిక పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఈ పోటీలకు పలువురు మహిళల నుంచి విశేష స్పందన లభించింది.

Updated : 15 Feb 2022 16:52 IST

ఆన్‌లైన్ ‘రంగవల్లిక’ పోటీల విజేతలు వీరే!

సరదాల సంక్రాంతిని పురస్కరించుకుని 'ఈనాడు వసుంధర' ఆన్‌లైన్ రంగవల్లిక పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పోటీలకు పలువురు మహిళల నుంచి చక్కటి స్పందన లభించింది.

జనవరి ౧౩న జూమ్ ద్వారా నిర్వహించిన తుది విడత పోటీలకు మొత్తం ౧౫ మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. రంగుల మేళవింపు, వైవిధ్యం / సృజనాత్మకత; ముగ్గును చక్కగా, స్పష్టంగా, అందంగా తీర్చిదిద్దిన తీరు.. మొదలైన అంశాల ప్రాతిపదికగా న్యాయనిర్ణేతలు వీరి నుంచి ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా- 'సంక్రాంతికి ప్రత్యేకంగా ఎలా ముస్తాబవ్వాలి' అనే అంశంపై ప్రముఖ సౌందర్య నిపుణురాలు, న్యాయనిర్ణేత కె. శోభారాణి ప్రత్యేక చిట్కాలు కూడా అందించారు. కరోనా నేపథ్యంలో సైతం 'ఈనాడు వసుంధర' ఆన్‌లైన్ లో రంగవల్లిక పోటీలను నిర్వహించి తమను ప్రోత్సహించడం పట్ల పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

విజేతల వివరాలు:

ప్రథమ బహుమతి: కర్నాటి సుబ్బలక్ష్మి, ఒంగోలు


ద్వితీయ బహుమతి: సీహెచ్ అన్నపూర్ణ, బుచ్చిరాజుపాలెం


తృతీయ బహుమతి: ఇందరపు వాణి, మంచిర్యాల

ఈ సందర్భంగా విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. విజేతలకు త్వరలోనే బహుమతులు అందిస్తాం. 

జూమ్ ద్వారా నిర్వహించిన తుది విడత పోటీలలో పాల్గొన్నవారు (ఫైనలిస్టులు):
1. ఇందరపు వాణి, మంచిర్యాల
2. సీహెచ్ అన్నపూర్ణ, బుచ్చిరాజుపాలెం
3. జోడు రేణుక, గోదావరిఖని
4. కర్నాటి సుబ్బలక్ష్మి, ఒంగోలు
5. వి. నీలమణి, తిరుపతి
6. అంచూరి అనిత, ఘన్ పూర్
7. వల్లదాసు రూప, హైదరాబాద్
8. శైలజా రామదుర్గం, బళ్లారి
9. జల పద్మజ, నందిగామ
10. ఎ. త్యుతిక, రాజమండ్రి
11. అనభేరి శృతి, కరీంనగర్
12. వి. సుభాషిణి, హైదరాబాద్
13. సప్నా రవి, కామారెడ్డి
14. సిద్దంశెట్టి సంధ్య, కామారెడ్డి
15. బోయిని రమాదేవి, పరకాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్