పెదాలు మెరవాలంటే..!

చర్మం తేమను కోల్పోవడం వల్ల ఆ ప్రభావం పెదాలపై కూడా పడుతుంది. తద్వారా పెదాలు పొడిబారిపోయి నిర్జీవమైపోతాయి. అలాంటప్పుడు ఈ న్యాచురల్‌ లిప్‌ స్క్రబ్స్‌ని ఉపయోగిస్తే పెదాలు....

Published : 06 Jul 2023 21:04 IST

చర్మం తేమను కోల్పోవడం వల్ల ఆ ప్రభావం పెదాలపై కూడా పడుతుంది. తద్వారా పెదాలు పొడిబారిపోయి నిర్జీవమైపోతాయి. అలాంటప్పుడు ఈ న్యాచురల్‌ లిప్‌ స్క్రబ్స్‌ని ఉపయోగిస్తే పెదాలు తిరిగి మెరుపును సంతరించుకుంటాయి.

అర టీస్పూన్‌ చొప్పున దాల్చిన చెక్క పొడి, తేనె, ఆలివ్‌ నూనె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై రాసి మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకొని లిప్‌ బామ్‌ రాసుకుంటే సరిపోతుంది.

రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున కమలాఫలం తొక్కల పొడి, బ్రౌన్‌ షుగర్‌ తీసుకొని అందులో కొన్ని చుక్కల బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో 30 సెకన్ల పాటు పెదాలపై మర్దన చేసుకొని కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

తేనె, బ్రౌన్‌ షుగర్‌.. వీటిని టేబుల్‌స్పూన్‌ చొప్పున తీసుకోవాలి. ఇందులో కొన్ని చుక్కల లావెండర్‌ నూనె కలిపి పెదాలపై రాసుకోవాలి. రెండు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దన చేసి ఆపై కడిగేసుకుంటే పెదాలు మృదువుగా మారతాయి.

బరకగా ఉన్న కాఫీ పొడి, తేనె.. ఈ రెండింటినీ టేబుల్‌స్పూన్‌ చొప్పున తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో పెదాలపై నెమ్మదిగా మర్దన చేసుకొని రెండు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే పొడి బారిన పెదాలు మెరుపును సంతరించుకుంటాయి.

కొన్ని గులాబీ రేకల్లో కొన్ని పచ్చి పాలు పోస్తూ పేస్ట్‌లా చేసుకోవాలి. దీంతో పెదాలపై కాసేపు మృదువుగా రుద్దుకొని కడిగేసుకుంటే ఇటు పెదాలు తేమను తిరిగి పొందడంతో పాటు అటు మంచి రంగులోకి వస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని