Exercise: వ్యాయామం తర్వాత తాగేయండి
వ్యాయామంలో బోలెడు కెలొరీలు కరిగిపోతాయి. ఒళ్లంతా అలసిపోతుంది. అందుకే పూర్తయ్యాక కాస్త నీరసంగా అనిపిస్తుంది. ఒక్కోసారి వెంటనే మరో పని చేయాలనీ అనిపించదు. తక్షణ శక్తి కావాలా? వీటిని తాగేయండి.
వ్యాయామంలో బోలెడు కెలొరీలు కరిగిపోతాయి. ఒళ్లంతా అలసిపోతుంది. అందుకే పూర్తయ్యాక కాస్త నీరసంగా అనిపిస్తుంది. ఒక్కోసారి వెంటనే మరో పని చేయాలనీ అనిపించదు. తక్షణ శక్తి కావాలా? వీటిని తాగేయండి.
* చాక్లెట్ మిల్క్.. చాలామంది అమ్మాయిల చీట్ డేలో ఇది తప్పనిసరి. అలాంటిది కష్టపడి కెలొరీలు తగ్గించుకున్నాక దీన్ని తాగమంటారేంటి అంటారా? వ్యాయామం తర్వాత దీన్ని తీసుకుంటే తక్షణ శక్తి ఖాయమంటోంది ఓ అధ్యయనం. అదనంగా దీనిలోని కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ ఎముకల ఆర్యోగానికీ సాయపడతాయి.
* స్మూతీలు.. పండ్లు, కూరగాయలతో చేసిన స్మూతీల్లో పోషకాలు పుష్కలం. శక్తి త్వరగా పుంజుకునేలా చేస్తాయివి. వాటికి కాస్త నట్ బటర్‌నీ జోడించుకుంటే ఎముకలకూ దృఢత్వం.
* గ్రీన్ టీ.. ఉదయం నిద్ర లేవగానే దీన్ని తీసుకునేవారు చాలామందే! కానీ వ్యాయామం తర్వాత తీసుకొని చూడండి. దీనిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్‌ఫ్లమేషన్‌ని దరిచేరనీయవు. కొద్ది మొత్తంలో ఉండే కెఫిన్ సహజంగానే శక్తినిస్తుంది.
* కొబ్బరినీళ్లు.. వ్యాయామ సమయంలో చెమట రూపంలో నీరంతా బయటకు పోతుంది. డీహైడ్రేషన్‌ను తప్పించడంలో వీటిలోని ఎలక్ట్రోలైట్స్ సాయపడతాయి. కెలొరీలు తక్కువ, శరీరానికి తోడ్పడే పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎక్కువ. శక్తిని కూడగడుతూనే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ అందిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.