Published : 17/12/2021 20:34 IST

చుండ్రు.. జుట్టు రాలడం.. పరిష్కారం ఏమిటి?

నా వయసు 25 సం.లు. నాకు తలలో చిన్న చిన్న కురుపులు వస్తున్నాయి. చుండ్రు సమస్య కూడా ఉంది. అలాగే జుట్టు కూడా ఎక్కువగా రాలుతోంది. ముఖ్యంగా పాపిట దగ్గర జుట్టు రాలిపోయి బట్టతల మాదిరిగా తయారవుతోంది. నా సమస్యకు పరిష్కారం చూపండి. - సింధూర

కొంతమందిలో చుండ్రు వల్ల తలలో కురుపులు వస్తుంటాయి. అందుకే ముందు చుండ్రుని తగ్గించుకొంటే స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. దీనికోసం ఏం చేయాలంటే..

మెంతుల పేస్ట్ - రెండు టీస్పూన్లు

వెనిగర్ - టీస్పూన్

పెరుగు - కప్పు

ఈ మూడింటిని తీసుకొని పేస్ట్లా చేసుకొని మాడుకి అప్త్లె చేసుకోవాలి. కొంత సమయం మృదువుగా మర్దన చేసి.. ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం ఐదు నిమిషాల పాటు తలకు ఆవిరి పట్టి.. ఆ వెంటనే తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది.

ఇక జుట్టు రాలడాన్ని నివారించడానికి ఈ హెయిర్‌ప్యాక్ వేసుకొంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీనికోసం..

గుడ్డు - 1

నిమ్మకాయ - 1

ఆలివ్‌నూనె - 4 టేబుల్‌స్పూన్లు

పెరుగు - కప్పు

వీటన్నింటినీ బ్లెండర్ సాయంతో లేదా మిక్సీలో వేసి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు అప్త్లె చేసి గంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఇలా రెండు నుంచి మూడు నెలల వరకు చేస్తే.. ఫలితం కనిపిస్తుంది. ఒకవేళ తగ్గకపోతే నిపుణులను సంప్రదించి హెమోగ్లోబిన్, థైరాయిడ్ పరీక్షలు చేయించుకొని వారి సూచనలు పాటించండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని