వైట్ డిశ్చార్జి.. మందులు వాడినా తగ్గడం లేదు..!
నమస్తే మేడమ్. నా వయసు 30. ఒక పాప. గత కొన్ని రోజుల నుంచి నాకు బాగా వైట్ డిశ్చార్జి అవుతోంది. డాక్టర్‌ని సంప్రదిస్తే ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. అవి వాడినప్పుడు తగ్గినట్టే తగ్గి మళ్లీ అవడం మొదలైంది...
నమస్తే మేడమ్. నా వయసు 30. ఒక పాప. గత కొన్ని రోజుల నుంచి నాకు బాగా వైట్ డిశ్చార్జి అవుతోంది. డాక్టర్‌ని సంప్రదిస్తే ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. అవి వాడినప్పుడు తగ్గినట్టే తగ్గి మళ్లీ అవడం మొదలైంది. ఇలా ఎందుకవుతోంది? దీనికి పరిష్కారమేంటో చెప్పండి. - ఓ సోదరి
జ: సాధారణంగా కొద్ది రోజుల పాటు మందులు వాడితే వైట్ డిశ్చార్జి తగ్గిపోతుంది. కానీ తగ్గినట్టే తగ్గి తరచుగా తిరగబెడుతుంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేసి చూడాలి. ఎందుకంటే కలయిక ద్వారా ఈ ఇన్ఫెక్షన్ మీ వారి నుంచి మీకు సంక్రమించడం, మీకు ఇన్ఫెక్షన్ కలగజేసిన బ్యాక్టీరియా తరచూ వాడే మందులకు స్పందించకపోవడం, మీకు కలయిక ద్వారా సంక్రమించే వ్యాధులుండడం, మధుమేహం.. మొదలైనవన్నీ ఇందుకు కారణం కావచ్చు. కాబట్టి మీరు సాధారణ రక్తపరీక్ష, మూత్రపరీక్ష, షుగర్ టెస్ట్, పాప్‌స్మియర్, హెచ్‌పీవీ, ఆర్‌టీఐ (రీ-ప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) స్క్రీనింగ్ టెస్టులు.. మొదలైన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే మీవారు కూడా ఒకసారి పరీక్ష చేయించుకొని.. అవసరమైతే మీతో పాటు ఆయన కూడా మందులు వాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.