దంతాలకు గార పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?

నా వయసు 38 సంవత్సరాలు. దంతాలను ఎంత శుభ్రంగా ఉంచుకున్నా గార పడుతూనే ఉంటాయి. దాంతో పచ్చగా కనిపిస్తున్నాయి. కానీ, నా దంతాలను తెల్లగా ఉంచుకోవాలనుంది. ఇందుకు ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు...

Published : 17 Jun 2023 13:47 IST

(Representational Image)

నా వయసు 38 సంవత్సరాలు. దంతాలను ఎంత శుభ్రంగా ఉంచుకున్నా గార పడుతూనే ఉంటాయి. దాంతో పచ్చగా కనిపిస్తున్నాయి. కానీ, నా దంతాలను తెల్లగా ఉంచుకోవాలనుంది. ఇందుకు ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ దంతాలను ఎంత శుభ్రంగా ఉంచుకున్నా గార పడుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటప్పుడు దంతాల మధ్య గ్యాప్ ఉందా? క్రౌడింగ్ ఆఫ్ ది టీత్ ఉందా? సరిగా బ్రష్ చేయడం లేదా? వంటి విషయాలను పరిశీలించుకోవాలి. ఒకవేళ దంతాల మధ్య ఖాళీలు ఉంటే గార పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో టీత్ క్రౌడింగ్ ఉంటుంది. అంటే వారిలో దంతాల అమరిక సరిగా ఉండదు. మరికొంతమందికి పన్నుపై పన్ను ఉంటుంది. ఇలాంటప్పుడు టూత్‌బ్రష్ అన్ని భాగాలకు వెళ్లదు. దానివల్ల కూడా గార పడుతుంది.

మీకు ఈ రెండు కారణాలు కాకుండా గార సమస్య ఉందంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించుకుని ఫైబర్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. యాపిల్, జామ వంటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల దంతాలపై ఏర్పడిన గార తొలగిపోతుంటుంది. అలాగే భోజనం చేసిన ప్రతిసారీ నీటితో బాగా పుక్కిలించాలి. కొంతమంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. ఇలాంటి వారు టీ తాగేముందు నీళ్లను పుక్కిలించాలి. అలాగే టీ తాగిన 10 నిమిషాల తర్వాత మళ్లీ పుక్కిలించాలి.  ఇలా చేయడం వల్ల దంతాలపై గార పట్టకుండా ఉంటుంది. పై జాగ్రత్తలన్నీ పాటించినప్పటికీ గార పడుతుంటే ఒకసారి దంత వైద్యులను సంప్రదించండి. మళ్లీ గార రాకుండా తగిన చికిత్స అందిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని