కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్నా..!

నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం జాబ్‌ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేను. వెంటనే వారిని ఏదో ఒకటి అనేస్తాను. ఆఫీసులో నా ప్రవర్తన వల్ల చాలా సమస్యలు...

Updated : 04 Jul 2023 15:32 IST

నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం జాబ్‌ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేను. వెంటనే వారిని ఏదో ఒకటి అనేస్తాను. ఆఫీసులో నా ప్రవర్తన వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. వెంటనే స్పందించకుండా సహనంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా ఉండలేకపోతున్నా. ఆఫీసులో నా గురించి నా పైఅధికారులకు ఉన్నవీ లేనివీ కల్పించి చెబుతున్నారు. నా కోపం తగ్గి ఓపిగ్గా ఉండాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ పరిస్థితి చూస్తే కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం మీ సమస్యగా అనిపిస్తోంది. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే స్పందించడం, చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉండడం, పెద్దైన తర్వాత అదే కోపం వల్ల ఉద్యోగంలో సమస్యలు రావడం.. వంటివి ఎదుర్కొంటున్నానంటున్నారు. ఇలాంటి సమస్యకు తప్పనిసరిగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు కోపం ఎలాంటి సందర్భాల్లో వస్తోంది? కోపం వచ్చే ముందు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మీ స్పందన ఎలా ఉంటుంది?.. వంటివన్నీ తెలుసుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ చక్కగా ఉపయోగపడుతుంది. దీనివల్ల కోపాన్ని అదుపులో పెట్టుకునే పద్ధతులూ అలవడతాయి.

కొంతమంది ఒత్తిడి, ఆందోళనల వల్ల కూడా కోపాన్ని నియంత్రించుకోలేకపోతుంటారు. కాబట్టి మీరు ఒకసారి సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. వారు మీ కోపానికి గల అసలు కారణాన్ని తెలుసుకుంటారు. అలాగే మీకు మందుల అవసరం ఉందా? లేదా? అనే విషయంలోనూ సలహా ఇస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని