ప్రసవం తర్వాత బ్లీడింగ్‌, కడుపునొప్పి.. ఎందుకిలా?

మేడమ్‌.. నా వయసు 27. ఈ మధ్యే పాప పుట్టింది. ఇప్పుడు పాప వయసు ఏడు నెలలు. సిజేరియన్ అయింది. ప్రసవం తర్వాత బ్లీడింగ్‌, కడుపునొప్పి వస్తున్నాయి. అలాగే నీరసం, కాళ్లు, చేతులు నొప్పి పుట్టడం, లాగడం.. వంటి సమస్యలొస్తున్నాయి. ఈ సమస్యలకు....

Published : 19 Dec 2022 21:27 IST

మేడమ్‌.. నా వయసు 27. ఈ మధ్యే పాప పుట్టింది. ఇప్పుడు పాప వయసు ఏడు నెలలు. సిజేరియన్ అయింది. ప్రసవం తర్వాత బ్లీడింగ్‌, కడుపునొప్పి వస్తున్నాయి. అలాగే నీరసం, కాళ్లు, చేతులు నొప్పి పుట్టడం, లాగడం.. వంటి సమస్యలొస్తున్నాయి. ఈ సమస్యలకు తగిన పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

జ. మీరు పాప వయసు ఏడు నెలలు అని రాశారు.. కానీ ఇంకా పాలిస్తున్నారో లేదో రాయలేదు. పాలిచ్చేటప్పుడు తప్పనిసరిగా ఐరన్‌, క్యాల్షియం, విటమిన్లు.. మొదలైన సప్లిమెంట్స్‌ వాడాలి. లేకపోతే మీకు నీరసం, నొప్పులు రావడం సహజం. ఇక బ్లీడింగ్‌, కడుపునొప్పి ఎందుకొస్తున్నాయో తెలుసుకోవడానికి మీరు తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ని సంప్రదించి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, రక్తపరీక్షలు.. మొదలైనవి చేయించుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్