అలా అయితే గర్భం నిలుస్తుందా?

నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ లక్షణాలున్నాయి.. కానీ ఇవి కనిపించిన రెండు రోజులకే బ్లీడింగ్ అయింది.. అబార్షన్‌ అయినప్పుడు ఎలా నీరసంగా ఉంటుందో ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తోంది.

Published : 06 Aug 2023 10:57 IST

నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ లక్షణాలున్నాయి.. కానీ ఇవి కనిపించిన రెండు రోజులకే బ్లీడింగ్ అయింది.. అబార్షన్‌ అయినప్పుడు ఎలా నీరసంగా ఉంటుందో ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తోంది. దాంతో పాటు వికారం, తలనొప్పి.. వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. మరి, ఇలా బ్లీడింగ్‌ అయినా గర్భం నిలిచే అవకాశాలుంటాయా? - ఓ సోదరి

జ: మీకు ప్రెగ్నెన్సీ లక్షణాలున్నాయన్నారు.. కానీ అవి నిర్ధారించుకోవడానికి మీరు యూరిన్‌ టెస్ట్‌ కానీ, స్కాన్‌ కానీ చేయించుకున్నట్లు రాయలేదు. అందుకని నిజంగా మీకు గర్భం వచ్చిందో, లేదో; లేదంటే వచ్చి అబార్షన్‌ అయిందో.. అన్న విషయంలో స్పష్టత లేదు. ఇప్పుడైనా మీరు ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయించుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ఉందో, లేదో తెలుస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మొదటి వారాల్లో (Early Pregnancy) బ్లీడింగ్‌ కొద్దిగా కనిపించచ్చు. కాబట్టి మీరు ఓసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుంటే అసలు విషయం తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని