వక్షోజాలు బిగుతుగా మారాలంటే ఏం చేయాలి?
హలో మేడమ్.. నాకు ఇద్దరు పిల్లలు. బాబుకు నాలుగున్నరేళ్లు. పాపకు రెండున్నరేళ్లు. పాపకు పాలిచ్చినన్ని రోజులు నా వక్షోజాలు మంచి ఆకృతిలో, బిగుతుగా ఉండేవి. కానీ పాలు మానేసిన తర్వాత వదులుగా....
హలో మేడమ్.. నాకు ఇద్దరు పిల్లలు. బాబుకు నాలుగున్నరేళ్లు. పాపకు రెండున్నరేళ్లు. పాపకు పాలిచ్చినన్ని రోజులు నా వక్షోజాలు మంచి ఆకృతిలో, బిగుతుగా ఉండేవి. కానీ పాలు మానేసిన తర్వాత వదులుగా, తేలికగా మారిపోయాయి. అలాగే నేను బరువు కూడా బాగా తగ్గిపోయాను. పాప పుట్టినప్పుడు 53 కిలోలుండేదాన్ని.. ఇప్పుడు 40 కిలోలున్నాను. బరువు తగ్గడానికి, వక్షోజాల పరిమాణం తగ్గడానికి ఏమైనా సంబంధముందా? అవి తిరిగి బిగుతుగా మారి, మంచి ఆకృతి రావాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి
జ: మీరు రాసిన విషయం సర్వసాధారణంగా జరిగేదే! ఎందుకంటే పాలిచ్చేటప్పుడు పాల గ్రంథుల పరిమాణం పెరుగుతుంది. పాలతో నిండి ఉన్నప్పుడు వక్షోజాలు బిగుతుగా, పెద్దగా ఉంటాయి. పాలివ్వడం ఆపేసిన తర్వాత పాల గ్రంథుల పరిమాణం తగ్గుతుంది.. దానికి తోడు మీరు 13 కిలోలు తగ్గేటప్పటికి వక్షోజాల్లో ఉండే 50 శాతం కొవ్వు పదార్థం కూడా తగ్గిపోయి ఒకేసారి మీకు వక్షోజాలు వదులైపోయినట్లు, చిన్నవైపోయినట్లుగా అనిపిస్తోంది. అయితే మీరు చేయగలిగింది.. ఆరోగ్యకరమైన రీతిలో తిరిగి బరువు పెరగడం. తద్వారా రొమ్ముల్లో కొవ్వు పెరిగి వక్షోజాల పరిమాణం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది - వక్షోజాల కింద ఉండే కండరాలు (Pectoral Muscles) దృఢం కావడానికి వ్యాయామాలు చేయడం. ఏదేమైనా పిల్లలు పుట్టాక వక్షోజాల ఆకృతిలో మార్పు రావడం సాధారణమైన విషయం కాబట్టి దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.