దాచకుండా ఆ రహస్యం చెప్పేశా.. ఇప్పుడేమో వేధిస్తున్నాడు!

నాకు పెళ్లై ఆరు నెలలవుతోంది. మన మధ్య రహస్యాలు ఉండకూడదంటూ నా భర్త పెళ్లి కాకముందు తను ప్రేమించిన అమ్మాయిల గురించి చెప్పాడు. నేను కూడా నా లవ్‌ బ్రేకప్‌ గురించి చెప్పాను. అప్పుడు ఏమీ అనలేదు. కానీ, పెళ్లయ్యాక ఆ విషయం గుర్తు....

Published : 26 May 2023 11:56 IST

నాకు పెళ్లై ఆరు నెలలవుతోంది. మన మధ్య రహస్యాలు ఉండకూడదంటూ నా భర్త పెళ్లి కాకముందు తను ప్రేమించిన అమ్మాయిల గురించి చెప్పాడు. నేను కూడా నా లవ్‌ బ్రేకప్‌ గురించి చెప్పాను. అప్పుడు ఏమీ అనలేదు. కానీ, పెళ్లయ్యాక ఆ విషయం గుర్తు చేస్తూ చాలా మాటలు అంటున్నాడు. ‘అప్పుడే వద్దని చెబితే ఈ సమస్య ఉండేది కాదు’ అంటే సరైన సమాధానం ఇవ్వడం లేదు. తన మాటల కారణంగా మనశ్శాంతి లేకుండా పోతోంది. కౌన్సెలింగ్‌తో తనలో మార్పు వస్తుందా? ఒకవేళ కౌన్సెలింగ్‌కు రానంటే నేనేం చేయాలి? ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఇలాంటి మనస్పర్థలు ఈతరం దంపతుల్లో ఎక్కువగా గమనిస్తున్నాం. అందుకే పెళ్లికి ముందే పలు అంశాల గురించి ఒకరికొకరు చర్చించుకోవాలని సూచిస్తుంటాం. కానీ, మీరు ఈ విషయాన్ని ముందే చర్చించుకున్నా.. పెళ్లి తర్వాత సమస్యగా మారింది.

మీరు అతని గతం గురించి చెప్పినప్పుడు సానుకూలంగా తీసుకున్నారు. అయితే తను కూడా అంతే సానుకూలంగా తీసుకోలేకపోతున్నాడని అర్థమవుతోంది. అయితే మొదట అతను మిమ్మల్ని అడిగినప్పుడు ఉన్నంత ఫ్రీగా మీరు చెప్పిన తర్వాత లేడని తెలుస్తోంది. ఇలాంటి సున్నితమైన వాస్తవాలను జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, మీరు మరికొంత కాలం ఓపిగ్గా ఉండడానికి ప్రయత్నించండి. అతను అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. అలాగే ఈ విషయాన్ని పెద్దది చేయడం వల్ల వచ్చే నష్టాల గురించి కూడా వివరించే ప్రయత్నం చేయండి. అప్పటికీ అతనిలో మార్పు రాకపోతే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.

కౌన్సెలింగ్‌ ద్వారా ఇలాంటి వ్యక్తుల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఒకవేళ అతను కౌన్సెలింగ్‌కు రాకపోతే మీ మానసిక ఇబ్బందులను కారణంగా చూపుతూ అతన్ని సైకియాట్రిస్ట్‌ వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మొదటగా మీరు సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి మీ సమస్యను వివరించండి. ఆ తర్వాత మీ భర్తను లోపలికి పిలిచి సమస్యను చెప్పండి. వారు సమస్యను అర్థం చేసుకుని అతనికి అర్థమయ్యే విధంగా కౌన్సెలింగ్‌ ఇస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ సమస్య తప్పకుండా పరిష్కారమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్