తరచుగా అబార్షన్ అవుతోంది.. కారణమేమిటి?
నమస్తే మేడమ్.. మా బాబు వయసు 4 ఏళ్లు. రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో తరచూ నాకు గర్భస్రావం అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణమేంటో చెప్పండి....
నమస్తే మేడమ్.. మా బాబు వయసు 4 ఏళ్లు. రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో తరచూ నాకు గర్భస్రావం అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణమేంటో చెప్పండి. - ఓ సోదరి
జ. తరచూ గర్భస్రావాలవుతూ ఉంటే కారణమేంటో తెలుసుకోవడానికి తప్పనిసరిగా పరీక్షలన్నీ చేయాల్సి ఉంటుంది. ఒకటి రెండుసార్లైతే దాని కోసం పెద్దగా పరీక్షలన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ మూడుసార్లు గానీ అంతకంటే ఎక్కువసార్లు గానీ అయితే తప్పకుండా కారణం తెలుసుకోవాల్సి ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత కావచ్చు లేదా వ్యాధి నిరోధక వ్యవస్థలో కానీ, రక్తం గడ్డకట్టే వ్యవస్థలో కానీ లోపాలు కావచ్చు లేదా క్రోమోజోమ్స్-జీన్స్‌లో తేడాలు కావచ్చు.. వీటిని గుర్తించేందుకు పరీక్షలు చేసి, వాటి ఫలితాల ప్రకారం చికిత్స చేయించుకుంటే గర్భస్రావం కాకుండా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.