Updated : 25/03/2023 20:27 IST

స్పెర్మ్ కౌంట్ బాగానే ఉన్నా పిల్లలు పుట్టరా?

మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది.. ఇంకా పిల్లల్లేరు. నాకు థైరాయిడ్‌ సమస్య ఉంది (TSH-6.19). అలాగే కిడ్నీలో రాళ్లున్నాయి. నేను, మా వారు చెకప్స్‌ చేయించుకుంటున్నాం.. మా వారికి స్పెర్మ్‌ కౌంట్‌ 30 మిలియన్లు ఉన్నాయి. మాకు పిల్లలు పుట్టే మార్గం చెప్పండి. - ఓ సోదరి

జ: పెళ్లై ఎనిమిదేళ్లయిందన్నారు కానీ మీ వయసెంతో రాయలేదు. ఇప్పటికే ఎనిమిదేళ్లంటే చెకప్స్‌ కాకుండా చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకోసం పరీక్షలన్నీ వివరంగా చేయాల్సి ఉంటుంది. మీ గర్భాశయం - అండాశయాలు ఎలా ఉన్నాయో; మీ ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో అడ్డంకులేవీ లేకుండా తెరుచుకొని ఉన్నాయో, లేదో; మీ హార్మోన్ల సమతుల్యం ఎలా ఉందో.. ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి. అలాగే మీవారి స్పెర్మ్‌ కౌంట్‌ బాగానే ఉన్నా కదలిక ఎంత శాతం ఉందో, ఆరోగ్యంగా ఉన్న స్పెర్మ్స్‌ ఎంత శాతం ఉన్నాయో ఆ వివరాలు కూడా కావాలి. మీ థైరాయిడ్‌ సమస్య కూడా TSH స్థాయి 6.19 ఉందని రాశారు. కానీ మీకు పిల్లలు కావాలంటే ఈ స్థాయి 2.5 కంటే తక్కువగా ఉండాలి. ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌ని సంప్రదిస్తే మీకు ఏ చికిత్స ద్వారా గర్భం నిలుస్తుందో సూచించగలుగుతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని