నిద్ర మాత్రలకు బానిసవుతానేమో?
నా వయసు 45 సంవత్సరాలు. నేను గత కొంతకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాను. నిద్ర పట్టడానికి మాత్రలు వేసుకుంటున్నాను. కానీ, ఇలా నిద్ర మాత్రలకు బానిస కావడం నాకు ఇష్టం లేదు.
నా వయసు 45 సంవత్సరాలు. నేను గత కొంతకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాను. నిద్ర పట్టడానికి మాత్రలు వేసుకుంటున్నాను. కానీ, ఇలా నిద్ర మాత్రలకు బానిస కావడం నాకు ఇష్టం లేదు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - ఓ సోదరి
జ. ప్రస్తుతం చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల వల్ల చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుంది. కొంతమందికి వైద్య పరమైన సమస్యల వల్ల కూడా నిద్రపట్టకపోవచ్చు. అంటే ఐరన్ తక్కువగా ఉండడం, Obstructive Sleep Apnea (ఊపిరి అందక సడెన్‌గా మెలకువ రావడం) వంటి సమస్యల వల్ల కూడా నిద్రపట్టదు. అలాగే కొన్ని రకాల మాత్రలు వేసుకునే వారు కూడా నిద్రలేమిని ఎదుర్కొంటుంటారు. వీటికి తోడు రాత్రి పడుకునే ముందు ఆహారం ఎక్కువగా తీసుకోవడం.. కాఫీ, టీలు అధికంగా తాగడం వంటి అలవాట్లు కూడా సుఖనిద్రకు దూరం చేస్తుంటాయి. కాబట్టి ముందు మీ సమస్యకు గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాన్ని బట్టి నిపుణుల సలహా మేరకు తగిన చికిత్స తీసుకోవడం, మందులు వాడడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే కాఫీ, టీలు తాగే అలవాటును తగ్గించుకోవడం, ప్రతికూల ఆలోచనలు - ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, పడకగదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం.. వంటివి చేయాలి. దీనివల్ల నిద్రపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.