ఐయూఐ చికిత్స.. ఎంతవరకు ఫలిస్తుంది?
డాక్టర్.. నా వయసు 32. నేను నెల రోజులుగా ఐయూఐ చేయించుకుంటున్నాను. కానీ పిరియడ్ వచ్చింది. మా డాక్టర్ నాకు 14వ రోజు ఐయూఐ చేశారు. నాకు 16 లేదా 17వ రోజున అండం విడుదలవుతుందని చెప్పి ముందే....
డాక్టర్.. నా వయసు 32. నేను నెల రోజులుగా ఐయూఐ చేయించుకుంటున్నాను. కానీ పిరియడ్ వచ్చింది. మా డాక్టర్ నాకు 14వ రోజు ఐయూఐ చేశారు. నాకు 16 లేదా 17వ రోజున అండం విడుదలవుతుందని చెప్పి ముందే ఎందుకు చేశారో అర్థం కాలేదు. అలాగే పిరియడ్ వచ్చాక రెండో రోజు రమ్మన్నారు. ఈ ట్రీట్‌మెంట్ వల్ల చాలా నొప్పిగా ఉంటోంది.. భయమేస్తోంది. అసలు ఇది సక్సెసవుతుందా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి
జ. ఐయూఐ చేసే ముందు అండం ఎప్పుడు విడుదలవుతుందో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే చేస్తారు. అదీ ఒక నెలలో ఒకసారి గానీ లేదా రెండుసార్లు మాత్రమే చేస్తారు. మీరు ఐయూఐ ఎందుకు చేయించుకోవాలనుకున్నారో కారణం రాయలేదు. సాధారణంగా ఐయూఐ సక్సెసయ్యే అవకాశాలు నూటికి 10-15 శాతం వరకు మాత్రమే ఉంటాయి. అత్యధికంగా ఆరు నెలలు మాత్రమే ఈ చికిత్స ప్రయత్నించడానికి వీలుంటుంది. ఇది సక్సెస్ కాకపోతే సాధారణంగా ఐవీఎఫ్ చికిత్స సూచిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.