పేల బాధ తగ్గాలంటే ఏం చేయాలి?

నాకు పాతికేళ్లు. నా తలలో పేలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నిసార్లు దువ్వుకున్నా మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి....

Published : 24 Jun 2023 18:40 IST

నాకు పాతికేళ్లు. నా తలలో పేలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నిసార్లు దువ్వుకున్నా మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

జ: పావు లీటరు కొబ్బరి నూనె, కప్పు వేప గింజలు తీసుకోవాలి. ముందుగా కొబ్బరినూనెను సన్నని సెగపై 20 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద నుంచి దించి.. నూనె వేడిగా ఉన్నప్పుడే వేప గింజలు వేసి వారం రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచాలి. దీనివల్ల నూనె చేదెక్కుతుంది. దాన్ని తలకు అప్లై చేసుకొని గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తుండాలి. ఫలితంగా నాలుగు నుంచి ఐదు వారాల్లోనే తలలో పేలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే ఆరు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే దీన్ని ఉపయోగించినన్ని రోజులు వేప గింజలను నూనెలో అలాగే ఉంచాలే తప్ప వడకట్టకూడదు. తద్వారా వేప గింజల్లో ఉండే చేదు గుణం వల్ల పేలు పోవడంతో పాటు.. కుదుళ్లలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని