పెళ్లయ్యాక మొటిమలు.. పరిష్కారమేమిటి?

హాయ్ మేడం.. నా వయసు 26సం||. పెళ్త్లె 6 నెలలు అవుతోంది. నాది నార్మల్ స్కిన్. పెళ్లికి ముందు అసలు మొటిమలు ఉండేవి కావు. కానీ ఈ మధ్య రెండు మూడు నెలల నుంచి నా ముఖం మీద చాలా మొటిమలు వస్తున్నాయి. కొన్ని మచ్చలు కూడా అలాగే.....

Published : 21 Jun 2023 20:59 IST

హాయ్ మేడం.. నా వయసు 26సం||. పెళ్త్లె 6 నెలలు అవుతోంది. నాది నార్మల్ స్కిన్. పెళ్లికి ముందు అసలు మొటిమలు ఉండేవి కావు. కానీ ఈ మధ్య రెండు మూడు నెలల నుంచి నా ముఖం మీద చాలా మొటిమలు వస్తున్నాయి. కొన్ని మచ్చలు కూడా అలాగే ఉండిపోతున్నాయి. ఇంతకుముందెప్పుడూ ఇలా కాలేదు. ఇంతవరకు మొటిమల కోసం ఎలాంటి క్రీం వాడలేదు. కానీ ఇప్పుడు వాటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటోంది. నా ముఖం కూడా డల్‌గా కనిపిస్తోంది. దయచేసి నా సమస్యకు గల కారణాలు, వాటికి పరిష్కార మార్గాలు తెలుపగలరు. - ఓ సోదరి

సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయిల జీవనశైలి, తీసుకునే ఆహారంలో వారికి తెలియకుండానే చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. మొటిమలు రావడానికి ఇవి కూడా కారణాలని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీరు తీసుకునే ఆహారంలో నూనె సంబంధిత పదార్థాలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడితే సరిపోతుంది.

మొటిమలు తగ్గడానికి ప్యాక్:

కావాల్సినవి:

ముల్తానీమట్టి- అర చెంచా

జీలకర్ర, ధనియాలు, లవంగం మూడూ కలిపి తయారుచేసిన పౌడర్- అర చెంచా

బార్లీ పౌడర్- అర చెంచా

ఈ మూడింటినీ ఒక బౌల్లోకి తీసుకొని సరిపడినన్ని రోజ్‌వాటర్ వేసుకుంటూ మెత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. మొటిమలు ఉన్న చోట మాత్రమే ఈ ప్యాక్‌ని అప్త్లె చేసుకోవాలి. తర్వాత 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 4సార్ల్ల చొప్పున రెండు లేదా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

మచ్చలు తగ్గడానికి..

కావాల్సినవి:

కలబంద గుజ్జు- అర చెంచా

రోజ్‌వాటర్- అర చెంచా

తేనె- పావు చెంచా

ఈ మూడింటినీ బాగా కలిపి మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్త్లె చేయాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 4సార్ల చొప్పున రెండు లేదా మూడు నెలల పాటు క్రమంగా చేస్తే మచ్చలు కూడా తగ్గుతాయి.

మీకు రెండు సమస్యలు ఉన్నాయి కాబట్టి ముందుగా మొటిమల నివారణకు ప్యాక్ వేసుకొని తర్వాత మచ్చల నివారణకు ప్రయత్నించవచ్చు. లేదనుకుంటే వారానికి 4సార్లు ముల్తానీమట్టి ప్యాక్ వేసుకుంటారు కాబట్టి మిగతా రోజుల్లో కేవలం మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు ఉన్న ప్రాంతంలో మాత్రమే కలబంద గుజ్జు ప్యాక్‌ని అప్త్లె చేసుకోవాలి. రెండూ ఒకేసారి అప్త్లె చేయకూడదు. మొటిమలు తగ్గిన తర్వాతే మచ్చల నివారణకు ప్యాక్ వేసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని