Published : 25/02/2023 18:02 IST

ప్రసవం తర్వాత కాళ్లు, భుజాల్లో తిమ్మిరి.. కారణమేమిటి?

హలో డాక్టర్‌. నా వయసు 28 ఏళ్లు. నాకు 3 నెలల క్రితం సిజేరియన్‌ అయింది. ఏదైనా పని చేయడానికి వంగినప్పుడు నా కాళ్లు, భుజాల్లో తిమ్మిరి వస్తోంది. డెలివరీ సమయంలో నేను వెన్నునొప్పి, తలనొప్పితో బాధపడ్డా. దాని ప్రభావం వల్లే ఇలా జరుగుతోందా? ఇది శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుందా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

జ: మీకు ఒక ప్రత్యేకమైన భంగిమలో వంగినప్పుడే ఈ తిమ్మిరి వస్తోంది కాబట్టి వంగినప్పుడు నరాలపై ఏదో ఒత్తిడి కలుగుతోందని అర్థం. దీనికోసం మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ని సంప్రదించండి. ముఖ్యంగా వెన్నెముక పరీక్ష చేసి చూసి ఎక్కడైనా డిస్క్‌ ప్రొలాప్స్‌ (వెన్నెముక ఎముకల మధ్యలో ఉండే డిస్క్‌ పక్కకు జరగడం) లేదా వెన్నెముకలో ఇతర సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించి చూసి, దానికి సరైన చికిత్స అందిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని