నాది పొడి చర్మం.. ఎలాంటి సన్‌స్క్రీన్‌ వాడాలి?

నా వయసు 28 సంవత్సరాలు. నాకు సన్‌స్క్రీన్‌ లోషన్‌ అస్సలు పడడం లేదు. ఇది అప్లై చేసిన కాసేపటికే చర్మంపై ర్యాషెస్‌లాగా వస్తున్నాయి. బేసిగ్గా నాది పొడి చర్మం. నేను ఎలాంటి సన్‌స్క్రీన్‌ ఉపయోగిస్తే....

Published : 07 Jun 2023 13:21 IST

నా వయసు 28 సంవత్సరాలు. నాకు సన్‌స్క్రీన్‌ లోషన్‌ అస్సలు పడడం లేదు. ఇది అప్లై చేసిన కాసేపటికే చర్మంపై ర్యాషెస్‌లాగా వస్తున్నాయి. బేసిగ్గా నాది పొడి చర్మం. నేను ఎలాంటి సన్‌స్క్రీన్‌ ఉపయోగిస్తే మంచిది. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు సన్‌స్క్రీన్‌ లోషన్‌ పడట్లేదని అంటున్నారు. సన్‌స్క్రీన్‌ని చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, డాక్టర్‌ సలహా మేరకు మీ చర్మతత్వానికి సరిపోయే లోషన్‌ని ఎంపిక చేసుకోండి. సన్‌స్క్రీన్‌ వాడకం వల్ల పలు ప్రయోజనాలు చేకూరతాయి. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల చర్మం కమిలిపోవడం, ట్యాన్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చు. అలాగే చర్మ క్యాన్సర్‌ రాకుండానూ ఇది కాపాడుతుంది. SPF 30 విలువ గల సన్‌స్క్రీన్‌ ఎంచుకుంటే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు.

మీది పొడి చర్మం అని చెప్పారు. కాబట్టి, క్రీమ్‌ ఆధారిత సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడడం మంచిది. దీనివల్ల చర్మం తేమను సంతరించుకుంటుంది. కొంతమందిలో చర్మ అలర్జీకి సంబంధించిన వివిధ రకాల సమస్యలొస్తుంటాయి. ఇలాంటివారు.. పారా అమైనో బెంజోయిక్‌ యాసిడ్‌, బెంజోన్స్‌, ఆల్కహాల్‌, ఆస్ట్రిన్‌జెంట్స్‌.. వంటి రసాయనాలు లేని ఉత్పత్తుల్ని ఎంచుకోవాలి. అలాగే జింక్‌ ఆక్సైడ్‌, టైటానియమ్‌ డై ఆక్సైడ్‌ వంటివి ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా ర్యాషెస్‌ లాంటి సమస్యలు రాకుండా ఉంటుంది.

ఒకసారి సన్‌స్క్రీన్‌ అప్లై చేస్తే రోజంతా నిలిచి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది కేవలం రెండు గంటల పాటు మాత్రమే చర్మానికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి, ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకోవాలి. ఎండాకాలంలో చెమట ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి ఈ కాలంలో వాటర్‌ ప్రూఫ్‌ సన్‌స్క్రీన్స్‌ చక్కటి ఎంపిక.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్