గర్భాశయం సగమే వృద్ధి చెందితే పిల్లలు పుడతారా?

మేడం.. నాకు గర్భాశయం సగం మాత్రమే వృద్ధి చెందిందని, అది కూడా చిన్నగా ఉందని  డాక్టర్ చెప్పారు. నేను ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా. రెండు నెలల్లో అబార్షన్‌ అయింది. రెండోసారి ఐవీఎఫ్‌....

Published : 15 May 2023 20:31 IST

మేడం.. నాకు గర్భాశయం సగం మాత్రమే వృద్ధి చెందిందని, అది కూడా చిన్నగా ఉందని  డాక్టర్ చెప్పారు. నేను ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా. రెండు నెలల్లో అబార్షన్‌ అయింది. రెండోసారి ఐవీఎఫ్‌ చేయించుకోవాలనుకుంటున్నా. నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా? చెప్పగలరు. - ఓ సోదరి

జ: గర్భాశయం పాక్షికంగా మాత్రమే పెరగడాన్ని యునికార్నేట్ యుటరస్‌గా వ్యవహరిస్తారు. ఇది పుట్టుకతో వచ్చే లోపం. ఇటువంటి పరిస్థితి ఉన్న వాళ్లకి ఒక మూత్రపిండం కూడా ఉండకపోవచ్చు. ఇటువంటి యుటరస్‌ ఉన్నప్పుడు పిల్లలు పుట్టకపోవడం, గర్భస్రావాలు, నెలలు నిండకుండానే కాన్పు కావడం, బిడ్డ ఎదుగుదలలో లోపాలు.. వంటివన్నీ చాలా తరచుగా కనిపిస్తాయి. మీకు ఒకసారి ఐవీఎఫ్‌తో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి రెండోసారి కూడా రావచ్చు. కానీ యునికార్నేట్‌ యుటరస్‌తో తొమ్మిది నెలలు నిండటం చాలా అరుదు. మీకు చికిత్స చేస్తున్న డాక్టర్‌ ఇందులో ఉన్న సాధకబాధకాలు మీకు వివరంగా చెప్పగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్