జింక్ లోపం ఉంటే.. ఎలాంటి సమస్యలు వస్తాయి?

నా వయసు 35 సంవత్సరాలు. నాకు రక్తపరీక్షలో జింక్‌ లోపం ఉందని తెలిసింది. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? - ఓ సోదరి. జ. జింక్‌ అనేది ఒక ట్రేస్‌ ఎలిమెంట్‌. ఇది చాలా ముఖ్యమైంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో క్రోమియం, జింక్‌, సెలీనియం వంటి మినరల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.

Published : 01 Jun 2024 18:35 IST

నా వయసు 35 సంవత్సరాలు. నాకు రక్తపరీక్షలో జింక్‌ లోపం ఉందని తెలిసింది.  దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? - ఓ సోదరి

జ. జింక్‌ అనేది ఒక ట్రేస్‌ ఎలిమెంట్‌. ఇది చాలా ముఖ్యమైంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో క్రోమియం, జింక్‌, సెలీనియం వంటి మినరల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. సాధారణంగా జింక్‌ స్థాయి 70 mcg/dL నుంచి 120 mcg/dL వరకు ఉండాలి. జింక్‌ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, తొందరగా అలసిపోవడం, నిద్ర ఎక్కువగా రావడం, బద్ధకం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. థైరాయిడ్‌ లక్షణాలు కూడా దాదాపు ఇదేవిధంగా ఉంటాయి.

జింక్‌ లోపం ఉన్నవారు దానిని భర్తీ చేసుకోవడానికి జింక్‌ ఉన్న మల్టీ విటమిన్‌ మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇతర విటమిన్ల లోపం ఏదైనా ఉందా.. అనేది కూడా చెక్‌ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా క్రోమియం, సెలీనియం, బి 12, బి 1, విటమిన్ సి, విటమిన్ డి-3 కూడా చెక్‌ చేయించుకోవాలి. ఒక్కో విటమిన్‌ లోపం ఉన్నప్పుడు ఒక్కో సమస్య ఉంటుంది. ఉదాహరణకు బి 12 తక్కువైతే తిమ్మిర్లు, బి 1 లోపిస్తే మతిమరుపు వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, మీకు ఏయే విటమిన్ల లోపం ఎక్కువగా ఉందో వాటిని భర్తీ చేసే మల్టీ విటమిన్‌ మాత్రలను వైద్యుని సలహాతో ప్రతి రోజూ వేసుకుంటే సమస్య నుంచి బయటపడచ్చు. అలాగే ఆయా పోషకాలు అధికంగా లభించే పదార్ధాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్