ఫీటల్‌ రిడక్షన్‌.. మంచిదా? కాదా?

హలో డాక్టర్‌.. నా బరువు 71.4 కిలోలు. నేను ఐవీఎఫ్‌ పద్ధతిలో గర్భవతినయ్యా. ప్రస్తుతం నాకు 9 వారాలు. నా గర్భాశయంలో మూడు పిండాలున్నాయి. 

Published : 16 Oct 2021 15:56 IST

హలో డాక్టర్‌.. నా బరువు 71.4 కిలోలు. నేను ఐవీఎఫ్‌ పద్ధతిలో గర్భవతినయ్యా. ప్రస్తుతం నాకు 9 వారాలు. నా గర్భాశయంలో మూడు పిండాలున్నాయి. అయితే ఫీటల్‌ రిడక్షన్‌ పద్ధతి ద్వారా ఒక పిండాన్ని తొలగించుకోవాలనుకుంటున్నా. అలాగే ప్రి-మెచ్యూర్‌ డెలివరీ కాకుండా ఉండాలంటే గర్భాశయానికి కుట్లు వేయాలని డాక్టర్‌ చెప్పారు. ఈ సమయంలో ఈ ట్రీట్‌మెంట్లు తీసుకోవచ్చా? ఏవైనా సమస్యలొస్తాయా? దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ: ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా మీకు ట్రిప్లెట్స్‌ గర్భంలో ఉన్నారు కాబట్టి ఫీటల్‌ రిడక్షన్‌ అనేది సాధారణంగా చేసే ప్రక్రియ. ఇందులో ఒక పిండాన్ని తొలగించి మిగిలిన రెండింటినీ పదిలంగా ఉంచుతారు. ఎందుకంటే ట్రిప్లెట్స్‌ ఉన్నప్పుడు సమస్యలు చాలానే ఎదురవుతాయి. నెలలు నిండి బిడ్డలు పుట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కవలలున్నా కూడా ఒక బిడ్డ ఉన్నప్పటి కంటే సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. గర్భస్రావం కావడం, నెలలు నిండకుండా కాన్పు జరగడం, తల్లికి-బిడ్డకి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు.. వంటివి వీటిలో కొన్ని! కానీ ట్రిప్లెట్స్‌ ఉన్నప్పుడు ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి.

అలాగే కవలలున్న ప్రతి ఒక్కరి గర్భాశయానికి కుట్లు వేయాల్సిన అవసరం లేదు. కొన్ని కచ్చితమైన సూచనలుంటేనే కుట్లు వేస్తారు. అంటే.. గర్భాశయ ద్వారం పొడవు తగ్గి తెరచుకుంటూ ఉందని అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా గుర్తించినట్లయితే కుట్లు వేయడం తప్పనిసరి. కవలలున్న ప్రతి గర్భిణికీ కుట్లు వేస్తే మంచి ఫలితం వస్తుందన్న దాఖలాలు లేవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్