ఫైబ్రాయిడ్స్‌ ఉంటే పిల్లలు పుట్టరా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 29. నాకు 18cm ఫైబ్రాయిడ్‌ ఉంటే మూడేళ్ల క్రితం సర్జరీ చేసి తొలగించారు. పెళ్లై రెండేళ్లయినా పిల్లలు పుట్టలేదు. ఎందుకని పరీక్షలు చేయించుకుంటే మళ్లీ 4cm ఫైబ్రాయిడ్స్‌ ఉన్నాయని చెప్పారు. దాంతో పాటు పీసీఓఎస్‌ కూడా నిర్ధారణ అయింది.

Updated : 19 Nov 2021 11:54 IST

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 29. నాకు 18cm ఫైబ్రాయిడ్‌ ఉంటే మూడేళ్ల క్రితం సర్జరీ చేసి తొలగించారు. పెళ్లై రెండేళ్లయినా పిల్లలు పుట్టలేదు. ఎందుకని పరీక్షలు చేయించుకుంటే మళ్లీ 4cm ఫైబ్రాయిడ్స్‌ ఉన్నాయని చెప్పారు. దాంతో పాటు పీసీఓఎస్‌ కూడా నిర్ధారణ అయింది. నా బరువు 99 కిలోలుంటే.. Apcod-Obis పౌడర్‌ ఇచ్చారు. దాంతో ప్రస్తుతం 92 కిలోలకు చేరుకున్నా. నాకు పిరియడ్స్‌ కూడా ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయి. నేను తల్లినవుతానా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.

- ఓ సోదరి

జ: మీరు తల్లి కావాలంటే ముందుగా మీ అధిక బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బరువు పెరిగిన కొద్దీ పీసీఓఎస్‌ సమస్య కూడాDr. Savitha Devi ఎక్కువవుతుంది. దానివల్ల ముఖ్యంగా అండం విడుదల కాకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వస్తాయి.

రెండోది - ఫైబ్రాయిడ్స్‌! ఇప్పుడున్న 4 సెం.మీ. ఫైబ్రాయిడ్స్‌ వల్ల పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. అయితే అది గర్భాశయం లోపలి పొరలోకి ఏమైనా ప్రవేశిస్తుందా అన్న విషయం ఒక్కసారి 3-డీ ట్రాన్స్‌ వెజైనల్‌ స్కాన్‌ ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి మీరు ప్రస్తుతం చేయాల్సింది.. బరువు తగ్గడం, పీసీఓఎస్‌ ఉంది కాబట్టి అండం విడుదల కావడానికి మందులు వాడడం. అలాగే ఎక్కువగా సమయం వృథా చేయడం మంచిది కాదు.. ఎందుకంటే మీకు వయసు పెరిగిన కొద్దీ ఇతర సమస్యలు వస్తాయి. ఇంకా ఫైబ్రాయిడ్స్‌ ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్