రెండు సార్లు అబార్షన్‌ అయ్యింది.. నేను తల్లినవుతానా?

హాయ్‌ మేడమ్‌.. నాకు ఆరునెలల వ్యవధిలోనే రెండు సార్లు అబార్షన్‌ అయ్యింది. ఇది జరిగి రెండున్నరేళ్లు అవుతోంది. మళ్లీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకుంటున్నాం. ఈ సమయంలో మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి సలహా ఇవ్వగలరు.

Updated : 30 Sep 2021 16:11 IST

హాయ్‌ మేడమ్‌.. నాకు ఆరునెలల వ్యవధిలోనే రెండు సార్లు అబార్షన్‌ అయ్యింది. ఇది జరిగి రెండున్నరేళ్లు అవుతోంది. మళ్లీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నాం. దయచేసి సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

జ. ఆరునెలల వ్యవధిలోనే రెండు సార్లు అబార్షన్‌ అయిందని రాశారు. అయితే ముందుగా వీటికి కారణమేంటో తెలియాలంటే వివరంగా అన్ని పరీక్షలు చేయించుకోవాలి. అలాగే మీకు గతంలో జరిగిన అబార్షన్స్‌ గురించి కొన్ని వివరాలు తెలియాలి. అంటే అసలు లోపల పిండం ఏర్పడిందా? ఒకవేళ ఏర్పడి ఉంటే హార్ట్‌బీట్‌ వచ్చిందా? వంటి అంశాలు తెలియాల్సి ఉంటుంది. ఈ క్రమంలో- మీరు తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 3-డీ ట్రాన్స్‌ వెజైనల్‌ స్కాన్‌ (గర్భాశయంలో లోపాలు తెలుసుకోవడానికి), వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించిన యాంటీ బాడీ టెస్టులు, క్రోమోజోములు-జీన్స్‌కు సంబంధించిన లోపాలున్నాయేమో తెలుసుకోవడానికి మీరు, మీ వారు క్యారియోటైప్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు హార్మోన్‌ ప్రొఫైల్‌ టెస్టులు, మీ వారు సెమెన్‌ అనాలిసిస్‌.. ఇవన్నీ చేయించుకోవడం తప్పనిసరి. ఒకవేళ వీటిలో మనం సరిచేయగలిగిన లోపాలుంటే తిరిగి గర్భవతి అయ్యే ముందు వాటికి చికిత్స చేయించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్