ఐదుసార్లు ఐవీఎఫ్‌ ఫెయిలైంది.. నేను తల్లినవుతానా?

హలో డాక్టర్‌. మాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. మాకు పిల్లల్లేరు. నా భర్తకు స్పెర్మ్‌ కౌంట్‌ 3 మిలియన్స్‌ ఉంది. ఐదుసార్లు ఐవీఎఫ్‌ ప్రయత్నించాం.. కానీ పిల్లలు కలగలేదు. మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

Published : 05 Jan 2022 19:34 IST

హలో డాక్టర్‌. మాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. మాకు పిల్లల్లేరు. నా భర్తకు స్పెర్మ్‌ కౌంట్‌ 3 మిలియన్స్‌ ఉంది. ఐదుసార్లు ఐవీఎఫ్‌ ప్రయత్నించాం.. కానీ పిల్లలు కలగలేదు. మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

జ: మీకు ఐదుసార్లు ఐవీఎఫ్‌ సక్సెస్‌ కాలేదంటే కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ముఖ్యంగా ఎంబ్రియోలో జన్యుపరమైన లోపాలుండడం, లేదా ఎంబ్రియో అతుక్కొని పెరగాల్సిన మీ గర్భాశయం లోపలి పొరలో లోపాలుండడం (ఎండోమెట్రియల్‌ రిసెప్టివిటీ).. వంటివి నిర్ధారించుకోవడానికి క్రోమోజోములు, జీన్స్‌ మొదలైన వాటిలో లోపాలున్నాయేమో మీరిద్దరూ పరీక్షలు చేయించుకొని జెనెటిక్‌ కౌన్సెలింగ్‌కి కూడా వెళ్తే మంచిది. ఒకవేళ ఎంబ్రియోలో లోపమైతే కనుక పీజీఎస్‌ (ప్రి ఇంప్లాంటేషన్‌ జెనెటిక్‌ స్క్రీనింగ్‌) అనే పద్ధతి ద్వారా ఐవీఎఫ్‌లో లభించిన ఎంబ్రియోలను గర్భాశయం లోపలికి పంపే ముందుగానే జెనెటిక్‌ టెస్ట్‌ చేసి ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే లోపల ప్రవేశపెడతారు. గర్భాశయం లోపలి పొర గురించి తెలుసుకోవడానికి ఒకసారి హిస్టరోస్కోపీ చేసి, ఆ పొర నుంచి బయాప్సీ చేసి, ప్రత్యేకమైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్