వెజైనల్ ఇన్ఫెక్షన్.. మందులు వాడినా తగ్గడం లేదు..!
నమస్తే డాక్టర్. నాకు అండం విడుదలయ్యే సమయంలో వెజైనా దగ్గర మంట వస్తోంది. అలా అప్పుడు మొదలైన ఈ సమస్య మళ్లీ పిరియడ్స్ వచ్చే దాకా ఉంటుంది. నెలసరి సమయంలో అంతా నార్మల్‌గానే ఉంటుంది. ఇలా గత ఆరు నెలలుగా...
నమస్తే డాక్టర్. నాకు అండం విడుదలయ్యే సమయంలో వెజైనా దగ్గర మంట వస్తోంది. అలా అప్పుడు మొదలైన ఈ సమస్య మళ్లీ పిరియడ్స్ వచ్చే దాకా ఉంటుంది. నెలసరి సమయంలో అంతా నార్మల్‌గానే ఉంటుంది. ఇలా గత ఆరు నెలలుగా జరుగుతోంది. పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకుంటే ఇన్ఫెక్షన్ ఉందని మందులిచ్చారు. అవి వాడిన మూడు నెలలు బాగానే ఉంది. కానీ కోర్సు పూర్తయ్యాక సమస్య మళ్లీ మొదలైంది. దీనికి శాశ్వత పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి
జ: మీకు తరచుగా ఇలాంటి సమస్య వస్తోందంటే ఇంకా వివరంగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ అనేది రకరకాల సూక్ష్మజీవుల వల్ల రావచ్చు. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్యారసైట్స్.. మొదలైన వాటిలో ఏదైనా ఉండచ్చు. తరచుగా వస్తోంది కాబట్టి వీటిలో అసలు కారకమేంటో తెలుసుకోవడానికి ఇంకా వివరంగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మీకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందేమో తెలుసుకోవడానికి కూడా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి భార్యాభర్తల్లో ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్లు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే మీ వారు కూడా మందులు వాడాల్సి రావచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.