పాప బరువు తగ్గుతోంది.. ఎందుకిలా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 21. మా వారి వయసు 27. నాకు ఈమధ్యే పాప పుట్టింది. డాక్టర్‌ ఇచ్చిన డెలివరీ డేట్‌ కంటే వారం రోజుల ముందే ప్రసవం చేశారు. అయితే పాప బరువు 1.9 కిలోలు ఉండే సరికి మూడు రోజుల పాటు NICUలో ఉంచి ఇంటికి పంపించారు. ఇప్పుడు బరువు మరింతగా తగ్గి 1.7 కిలోలకు చేరుకుంది. ప్రస్తుతం పాపకు నా పాలు పడుతున్నా.. అలాగే మధ్యమధ్యలో ఫార్ములా ఫీడ్‌ కూడా ఇస్తున్నాం. అయినా బరువు పెరగకపోగా ఇంకా తగ్గుతుంది. ఎందుకిలా జరుగుతుంది? పాప బరువు పెరగాలంటే ఏం చేయాలో దయచేసి చెప్పండి.

Updated : 06 Jul 2021 20:58 IST

నమస్తే డాక్టర్‌. నా వయసు 21. మా వారి వయసు 27. నాకు ఈమధ్యే పాప పుట్టింది. డాక్టర్‌ ఇచ్చిన డెలివరీ డేట్‌ కంటే వారం రోజుల ముందే ప్రసవం చేశారు. అయితే పాప బరువు 1.9 కిలోలు ఉండేసరికి మూడు రోజుల పాటు NICUలో ఉంచి ఇంటికి పంపించారు. ఇప్పుడు బరువు మరింతగా తగ్గి 1.7 కిలోలకు చేరుకుంది. ప్రస్తుతం పాపకు నా పాలు పడుతున్నా.. అలాగే మధ్యమధ్యలో ఫార్ములా ఫీడ్‌ కూడా ఇస్తున్నాం. అయినా బరువు పెరగకపోగా ఇంకా తగ్గుతోంది. ఎందుకిలా జరుగుతుంది? పాప బరువు పెరగాలంటే ఏం చేయాలో దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ: తొమ్మిది నెలలు నిండిన తర్వాత పుట్టినా కూడా మీ పాప బరువు తక్కువగా ఉందంటే గర్భం లోపల ఎదుగుదల సరిగ్గా లేదు అని అర్థం. ఈ పరిస్థితిని IUGR (Intrauterine growth restriction) అంటారు. ఒకవేళ ఇది ఉన్నా కూడా పుట్టిన తర్వాత వేరే సమస్యలేవీ లేకపోతే బరువు మామూలుగానే పెరగాలి. మొదటి పది రోజులు తగ్గినా.. తర్వాత రోజురోజుకీ బరువు పెరుగుతూ ఉండాలి. అలా జరగడం లేదంటే మీరు ఒకసారి పిడియాట్రీషియన్‌ని సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్