అండం పరిమాణం పెరగకపోతే..

హలో డాక్టర్‌. నా వయసు 30. నాకు ఎనిమిదేళ్ల బాబున్నాడు. రెండోసారి గర్భం ధరించినప్పుడు నాకు చికెన్‌పాక్స్‌ సమస్య వచ్చింది. దీనివల్ల బేబీకి అవయవ లోపం రావచ్చన్న ఉద్దేశంతో మూడో నెలలోనే అబార్షన్‌ చేశారు.

Published : 01 Sep 2023 19:37 IST

హలో డాక్టర్‌. నా వయసు 30. నాకు ఎనిమిదేళ్ల బాబున్నాడు. రెండోసారి గర్భం ధరించినప్పుడు నాకు చికెన్‌పాక్స్‌ సమస్య వచ్చింది. దీనివల్ల బేబీకి అవయవ లోపం రావచ్చన్న ఉద్దేశంతో మూడో నెలలోనే అబార్షన్‌ చేశారు. ఇప్పుడు మేము మళ్లీ గత మూడు నెలల నుంచి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నాం. కానీ సక్సెసవ్వట్లేదు. డాక్టర్‌ని సంప్రదిస్తే ఫాలోపియన్‌ ట్యూబ్స్‌లో బ్లాక్స్‌ ఏమీ లేవని, అయితే నా అండం పరిమాణంలో పెరుగుదల లేదని అన్నారు. నాకు నెలసరి సమస్యలు కూడా ఏమీ లేవు. నేను త్వరగా గర్భం ధరించాలంటే ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి

జ. మీరు మూడు నెలల నుంచి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నా సక్సెసవ్వట్లేదని చెబుతున్నారు. అయితే ఒకవేళ అండం పరిమాణంలో పెరుగుదల లేకపోతే దాని కోసం ప్రత్యేకంగా మందులు వాడాల్సి ఉంటుంది. ఏదేమైనా త్వరగా గర్భం ధరించడమనేది మన చేతిలో లేదు. ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ ఒక సంవత్సర కాలంలో వంద ప్రయత్నాల్లో 60-70 శాతం మాత్రమే సక్సెసవుతాయి. అందుకే ఇంకా కొన్ని రోజులు సాధారణంగానే ప్రయత్నించి చూడండి. ఒకవేళ అప్పటికీ గర్భం నిలవకపోతే దానికి అవసరమైన చికిత్స తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని