నలభైల్లో మొటిమలు.. తగ్గేదెలా?

నాకు నలభయ్యేళ్లు. నా ముఖం మీద మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని క్రీమ్స్ వాడినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. ఇవి తగ్గాలంటే ఏం చేయాలి?

Published : 14 Aug 2023 15:09 IST

హలో మేడమ్, నాకు నలభయ్యేళ్లు. నా ముఖం మీద మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని క్రీమ్స్ వాడినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. ఇవి తగ్గాలంటే ఏం చేయాలి?

మీకు నలభయ్యేళ్లు అంటున్నారు కాబట్టి మెనోపాజ్‌కి దగ్గరగా వచ్చారేమో ఒకసారి వైద్యుల్ని సంప్రదించి తెలుసుకోండి. ఒకవేళ మీకు మెనోపాజ్ దశ మొదలైతే కనుక ఈ మొటిమల సమస్యకు వారే చికిత్స అందిస్తారు. వాటితో పాటు ఇంట్లోనే లభ్యమయ్యే కొన్ని పదార్థాలతో తయారు చేసే ఫేస్‌ప్యాక్స్ కూడా మీరు ప్రయత్నించి చూడచ్చు.
కావాల్సినవి:
* జీలకర్ర పొడి- పావు టీస్పూన్
* లవంగం పొడి- పావు టీస్పూన్
* ముల్తానీమట్టి- రెండు చెంచాలు
ఈ మూడింటినీ ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా రోజ్‌వాటర్‌తో మిక్స్ చేసుకొని, ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని