Published : 12/01/2023 21:17 IST

ఆ సమస్య వల్ల భర్తతో కలవలేకపోతున్నా..

హాయ్ మేడం. నాకు పెళ్త్లె నాలుగేళ్లవుతోంది. నాకు తరచుగా యోనిలో బాయిల్స్ లాగా వస్తున్నాయి. ప్రత్యేకించి పిరియడ్స్ వచ్చాక అవి ఏర్పడుతున్నాయి. దాంతో ఆ ప్రదేశంలో బాగా సలపరంగా అనిపిస్తోంది. అలా వచ్చి మళ్లీ పిరియడ్స్ రావడానికి ఒక నాలుగైదు రోజులు టైముందనగా వాటంతట అవే పోతున్నాయి. ఈ సమస్య వల్ల నేను నా భర్తతో కలవలేకపోతున్నాను. ఎంతమంది డాక్టర్లకు చూపించినా తాత్కాలికంగానే తప్ప శాశ్వతంగా పరిష్కారం దొరకట్లేదు. నాకు ఇంకా పిల్లలు కూడా లేరు. ఈ సమస్య వల్ల నాకు పిల్లలు పుడతారో లేదో అని చాలా ఆందోళనగా ఉంది. హెచ్ఎస్‌వీ టెస్ట్ కూడా చేయించాను.. నెగెటివ్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. - ఓ సోదరి

జ: సాధారణంగా మీరు చెప్పిన లక్షణాలు హెర్పెస్ ఇన్ఫెక్షన్‌లో కనిపిస్తాయి. కానీ మీరు టెస్ట్ కూడా చేయించానని, అది నెగెటివ్ వచ్చిందని రాశారు. యోనిలో ఇతర ఇన్ఫెక్షన్లుండడం లేదా చర్మ వ్యాధి.. వంటివి ఈ సమస్యకు ఇతర కారణాలు కావచ్చు. అందుకని మీరు వివరంగా పరీక్షలు చేయించుకొని ఈ సమస్య తగ్గిన తర్వాతే పిల్లల కోసం ప్లాన్ చేయడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని