తాగే నీటిని ఇలా నిల్వ చేయాలట!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు తాగు నీరు కూడా ఎంతో ముఖ్యం. మన శరీరంలోని జీవక్రియలన్నీ మనం తీసుకునే నీటి పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే సరిపడినన్ని నీళ్లు తాగితే మనకెదురయ్యే ఆరోగ్య సమస్యల్లో సగం వాటిని తగ్గించుకోవచ్చని నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే చాలామంది నీళ్లు తాగడంపై పెట్టే దృష్టి వాటిని నిల్వ చేయడంపై దృష్టి పెట్టరు.

Updated : 06 Aug 2021 17:42 IST

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు తాగు నీరు కూడా ఎంతో ముఖ్యం. మన శరీరంలోని జీవక్రియలన్నీ మనం తీసుకునే నీటి పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే సరిపడినన్ని నీళ్లు తాగితే మనకెదురయ్యే ఆరోగ్య సమస్యల్లో సగం వాటిని తగ్గించుకోవచ్చని నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే చాలామంది నీళ్లు తాగడంపై పెట్టే దృష్టి వాటిని నిల్వ చేయడంపై దృష్టి పెట్టరు.

ఆ పాత్రల్లోనే నిల్వ చేయండి!

ప్రధానంగా వర్షాకాలంలో తాగునీరు కలుషితం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఫలితంగా విరేచనాలు, వాంతులతో పాటు జీర్ణ సంబంధ సమస్యలూ తలెత్తవచ్చు. ఈ పరిస్థితుల్లో తాగునీటిని నిల్వ చేసేందుకు మట్టి పాత్రలు, రాగి పాత్రలు ఎంచుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాత్రల్లో నీటిని నిల్వ చేయడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

మట్టి పాత్రలు

మట్టి పాత్రల్లోని మట్టి కణాల మధ్య చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇవి తాగునీటిని ఎక్కువ సేపు తాజాగా, చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ మట్టి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు శరీరంలో ఆమ్లాలుగా మారి వివిధ రకాల ట్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు తలెత్తుతాయి. మట్టి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి నీటి ఉష్ణోగ్రతను కూడా క్రమబద్ధీకరించి జలుబు, గొంతు సమస్యలు మరింత తీవ్రతరం కాకుండా చేస్తాయి. చర్మ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి. శక్తిని కూడా పెంచుతాయి.

అలా శుభ్రం చేయద్దు!

మట్టి పాత్రల్లో నీటిని నిల్వ చేయడం వల్ల చల్లగా ఉండడమే కాదు..నీటికి చక్కటి రుచి కూడా వస్తుంది. మట్టి కుండను మొదటిసారి ఉపయోగించే ముందు అందులో కొద్దిసేపు నీళ్లు పోసి ఉంచాలి. మట్టి పాత్రల్లో ఆహారం వండడం, పాలు లేదా నీళ్లు వేడి చేయడం లాంటివి కూడా చేయవచ్చు. అయితే అతి తక్కువ మంట పైనే. ఎక్కువ మంటను ఉపయోగించడం వల్ల ఇవి పగిలిపోయే ప్రమాదముంది. మట్టి పాత్రలను సబ్బు, ఇతర రసాయనాలతో శుభ్రం చేయడం మంచిది కాదు. వీటికి బదులు నిమ్మరసం, వేడినీళ్లను వాడాలి.

రాగి పాత్రలు

మంచి నీటిని నిల్వ చేసుకునే విధానంలో రెండో పద్ధతి రాగి పాత్రలు. ఈ పాత్రల్లో స్టోర్‌ చేసిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మూడు రకాల దోషాలు (వాత, పిత్త, కఫ) తగ్గిపోతాయి. వీటితో పాటు శరీరానికి అవసరమైన రాగి కూడా సులభంగా అందుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలివే!

రాగి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడడమే కాకుండా వాటి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. ఫలితంగా క్యాన్సర్‌ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరానికి హాని కలిగించే అతినీలలోహిత కిరణాల నుంచి కూడా రాగి రక్షణ కల్పిస్తుంది. ఇక రక్తపోటు సమస్యలున్న వారు, అధిక బరువును తగ్గించాలనుకునేవారు రాగి పాత్రల్లోని నీరు తాగడం ఉత్తమం.

ఇలా వాడద్దు!

తీవ్ర రక్తస్రావం సమస్యలున్న వారు రాగి పాత్రల్లో నీటిని తాగకపోవడం మంచిది. దీంతో పాటు రాగి పాత్రల్లో ఆహారాన్ని వండడం, పాలు, నీళ్లను వేడి చేయడం కూడా శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల రాగి విషతుల్యం అవుతుందట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్