ఛాయను పెంచే చిట్కాలివి....

అందంగా కనిపించాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే! తరచూ ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంటుంది. అదే టాన్‌. క్రీములు వాడటం, ఫేషియల్స్‌ చేయించుకోవడం అన్ని సార్లూ కుదరకపోవచ్చు.

Published : 02 Jan 2023 00:34 IST

అందంగా కనిపించాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే! తరచూ ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంటుంది. అదే టాన్‌. క్రీములు వాడటం, ఫేషియల్స్‌ చేయించుకోవడం అన్ని సార్లూ కుదరకపోవచ్చు. సులువుగా, సహజంగా నలుపుదనం పోవాలంటే మాత్రం ఈ చిట్కాలు పాటించాల్సిందే. అవేంటంటే...


తేనె- ఉలవపిండి:  రెండు చెంచాల ఉలవపిండి, కాస్త తేనె, రెండు చెంచాల గులాబీ నీళ్లూ కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖం, మెడ, చేతులూ వంటి టాన్‌ పట్టే శరీర భాగాలకు రాసి ఆరనివ్వాలి. ఆపై చేతులు తడుపుతూ నలుగు పెడితే సరి. చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.


కలబంద- టోమాటో: చెంచా చొప్పున కలబంద, కాఫీపొడి, టొమాటో గుజ్జు తీసుకుని దానికి చెంచా పెసరపిండి, కాస్త వెన్న కలిపి ఒంటికి రాసి మృదువుగా రుద్దాలి. దీనివల్ల టాన్‌ తొలగి చర్మం వన్నెలీనడమే కాదు.. మృదువుగానూ మారుతుంది.


కీరదోస-గులాబీ నీళ్లూ: టేబుల్‌ స్పూన్‌ చొప్పున నిమ్మరసం, కీరదోస రసం, గులాబీ నీరు కలిపి ఒంటికి రాయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేసుకోండి. ఇలా రోజుకోసారి ఓ పదిహేను రోజులు చేసి చూడండి. చర్మ ఛాయ మెరుగుపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్