Gita Gopinath: ఆ గోడపై ఆమె చిత్రం.. ట్రెండ్ బ్రేక్ చేసింది!
నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే కెరీర్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించచ్చు. ఇందుకు తాజా ఉదాహరణే ప్రఖ్యాత ఆర్థికవేత్త గీతా గోపీనాథ్. ఎంతో మక్కువతో అర్ధశాస్త్రాన్ని ఎంచుకున్న ఆమె.. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. తన ప్రతిభాపాటవాలతో ఎన్నో కీలక పదవులు.....
(Photo: Instagram)
నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే కెరీర్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించచ్చు. ఇందుకు తాజా ఉదాహరణే ప్రఖ్యాత ఆర్థికవేత్త గీతా గోపీనాథ్. ఎంతో మక్కువతో అర్ధశాస్త్రాన్ని ఎంచుకున్న ఆమె.. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. తన ప్రతిభాపాటవాలతో ఎన్నో కీలక పదవులు అధిరోహించి ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్తగా తనకంటూ ఓ ప్రత్యేక పేజీ లిఖించుకున్న గీత.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించారు. ఓ అపురూప చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తలుగా పనిచేసిన వ్యక్తుల సరసన తన చిత్రం కూడా చేరిందంటూ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!
ఆ గ్యాలరీలో తనొక్కర్తే!
అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)తో గీతది నాలుగేళ్ల అనుబంధం. 2018లో ఈ సంస్థకు తొలి మహిళా ప్రధాన ఆర్థికవేత్తగా బాధ్యతలు అందుకున్న ఆమె.. కొన్ని నెలల క్రితమే డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు. ఇక అంతకుముందు ప్రధాన ఆర్థికవేత్తగా మరెన్నో కీలక పదవుల్లో పనిచేసిన ఆమె.. తాజాగా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఐఎంఎఫ్‌కు ప్రధాన ఆర్థికవేత్తలుగా పనిచేసిన వారి ఫొటోలను గోడపై అమర్చిన చిత్రాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు గీత. ఇందులో ఆఖరి ఫొటో గీతది కావడం, ఈ గ్యాలరీలో ఏకైక మహిళ ఆమె ఒక్కర్తే కావడం విశేషం. దీనిపై స్పందిస్తూ.. ‘ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ.. ఇప్పటివరకు ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తలుగా పనిచేసిన వ్యక్తుల సరసన నా చిత్రం కూడా చేరింది..’ అంటూ మురిసిపోయారామె. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.
అర్థశాస్త్రంపై మక్కువతో..
❁ భారత - అమెరికన్ ఆర్థికవేత్తగా పేరుపొందిన గీతా గోపీనాథ్ 1971, డిసెంబర్ 8న మైసూర్లో టీవీ గోపీనాథ్, వీసీ విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ఇద్దరమ్మాయిల్లో గీత చిన్నవారు.
❁ మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్లో స్కూలింగ్ పూర్తిచేసిన గీత.. దిల్లీలోని లేడీ శ్రీరాం మహిళా కళాశాలలో బీఏ పూర్తిచేశారు. ఈ సమయంలోనే ఆర్థికశాస్త్రాన్ని తన కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. భారత్‌లో 1990-91లో తొలిసారిగా భారీ ఆర్థిక సంక్షోభం తలెత్తిందని, అదే తనని పీజీలో ఆర్థికశాస్త్రం సబ్జెక్టు ఎంచుకోవడానికి, అంతర్జాతీయ ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరగడానికి దోహదం చేసిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారామె.
❁ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేసిన గీత.. ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఈ సమయంలోనే ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ‘ప్రిన్స్టన్స్ ఉడ్రూ విల్సన్ ఫెలోషిప్ రీసెర్చ్ అవార్డు’ అందుకున్నారామె.
❁ చదువు పూర్తిచేసుకున్నాక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించిన గీత.. పలు జర్నల్స్‌కి కో-ఎడిటర్‌గా; మేనేజింగ్ ఎడిటర్‌గా కొనసాగారు. అంతేకాదు.. గతంలో ‘ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్’ ఆర్థిక సలహాదారుల ప్యానల్ సభ్యురాలిగానూ ఉన్నారామె.
❁ అర్థశాస్త్రంపై ఉన్న మక్కువే ఆమెను 2010లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర విభాగానికి శాశ్వత ప్రొఫెసర్‌గా ఎంపికయ్యేలా చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్‌గా, మూడో మహిళగా నిలిచారు గీత. అంతకుముందు మన దేశం నుంచి ఈ విశ్వవిద్యాలయంలో శాశ్వత ప్రొఫెసర్‌గా నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ ఎంపికయ్యారు.
❁ 2011లో ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్’లో ఒకరిగా గుర్తింపు పొందారు గీత.
❁ 2016-18 వరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించారు గీతా గోపీనాథ్.
❁ మేటి ఆర్థికవేత్తగానే కాదు.. మంచి రచయిత్రిగానూ తనను తాను నిరూపించుకున్నారు గీత. ఈ క్రమంలో వాణిజ్యం, పెట్టుబడి, ద్రవ్య విధానం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు.. తదితర అంశాలపై అధ్యయనం చేసి ప్రముఖ పత్రికలకు ఆర్టికల్స్ కూడా రాశారామె.
❁ 2019లో విడుదలైన ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్’ ఎడిషన్‌కి కో-ఎడిటర్‌గానూ వ్యవహరించారీ లేడీ ఎకనమిస్ట్.
❁ 2018లో ఐఎంఎఫ్‌కి తొలి మహిళా చీఫ్ ఎకనమిస్ట్‌గా పదవి చేపట్టిన గీత.. ఈ ఘనత సాధించిన రెండో భారతీయురాలిగా నిలిచారు. ఆమె కంటే ముందు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఆయన ఈ పదవిలో 2003 నుంచి 2006 వరకు కొనసాగారు.
❁ గీత భర్త ఇక్బాల్ సింగ్ ధలివాల్. ప్రస్తుతం ఆయన మసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని (ఎంఐటీ) ఆర్థికశాస్త్రం విభాగానికి చెందిన ‘అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్’కి గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ జంటకు రోహిల్ (18 ఏళ్లు) అనే కుమారుడున్నాడు.
❁ 2015లో మైసూర్‌లోని మైరా బిజినెస్ స్కూల్ ‘వుమెన్ అఛీవర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’లో గీతకు చోటు కల్పించింది.
❁ అర్థశాస్త్రంలో ఆమె చేస్తోన్న సేవలకు గుర్తింపుగా వాషింగ్టన్ విశ్వవిద్యాలయం 2017లో ఆమెను ‘విశిష్ట పూర్వ విద్యార్థి’ అవార్డుతో సత్కరించింది.
❁ 2019లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ అవార్డు అందుకున్నారు గీత.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!