గొప్ప తండ్రులు!

కూతురి కోసం నాన్న ప్రపంచాన్నే ఎదిరిస్తాడు. ఇప్పుడే కాదు, చరిత్రపుటలను తరచి చూసినా ఇటువంటి తండ్రులు కనిపిస్తూనే ఉంటారు...

Published : 16 Jun 2024 03:52 IST

కూతురి కోసం నాన్న ప్రపంచాన్నే ఎదిరిస్తాడు. ఇప్పుడే కాదు, చరిత్రపుటలను తరచి చూసినా ఇటువంటి తండ్రులు కనిపిస్తూనే ఉంటారు...

కూతురి మరణంతో...

చార్లెస్‌ డార్విన్‌... ప్రపంచం మెచ్చే శాస్త్రవేత్తే కాదు... ఓ మంచి తండ్రి కూడా. డార్విన్‌కి పదిమంది పిల్లలు. ఆ కాలంలో ఆడపిల్లలను చదివించడం, వారి బాగోగులు దగ్గరుండి చూసుకోవడం మగవాళ్లు చేసేవారు కాదు. అటువంటి కాలంలోనే డార్విన్‌ తన కూతుళ్లను చదివించారు. తన పదేళ్ల కూతురు అనీ మరణం మాత్రం డార్విన్‌ను ఎంతగానో బాధించిందట. ఆ కారణంతోనే ఆయన మతాన్ని నమ్మడం మానేశారని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. అయితే, ఈ పరిణామమే ఆయన, పిల్లల ఎదుగుదలపై అనేక పరిశోధనలు చేయడానికీ, ఆపై మానవ పరిణామక్రమ సిద్ధాంతానికీ కీలకంగా మారాయి.

పాలనలోనూ పాలుపంచుకోవాలని...

రోమన్‌ రాజ్యానికి మొట్టమొదటి పాలకుడు షాలమేన్‌. పిల్లలంటే అమితమైన ప్రేమ. ఆయనకు మొత్తం 20 మంది పిల్లలట. అయితే... ఆడ, మగ అనే భేదం ఉండకూడదని... తన పిల్లలందరికీ విద్య చెప్పించేవారట. అంతేకాదు, పరిపాలనకు సంబంధించిన అనేక విషయాలూ వారికి నేర్పించేవారట. ఆయన మరణానంతరం కుమార్తెలకు దక్కాల్సిన ఆస్తిపాస్తుల్నీ వీలునామా రాశారట. అప్పటి కట్టుబాట్లకు ఎదురొడ్డి తన కూతుళ్లకోసం ఎంతో చేసిన ఈ నాన్న అటు బిడ్డలకు మంచి తండ్రిగానే కాకుండా, ‘ఫాదర్‌ ఆఫ్‌ యూరప్‌’ గానూ పేరొందారు. ఏది ఏమైనా తండ్రి ప్రేమ అనిర్వచనీయమైనది కదా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్