Sailing Expedition: అందుకోసమే ఈ సాహస యాత్ర!
మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నా.. వారికి క్రీడారంగంలో లభించే ప్రోత్సాహం తక్కువగా ఉంటోంది. అయినా పీవీ సింధు, మిథాలీ రాజ్, మేరీకోమ్.. వంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది వివిధ క్రీడల్లో అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే సెయిలింగ్ వంటి సాహస క్రీడల్లోకి మహిళలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
(Photo: Twitter)
మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నా.. వారికి క్రీడారంగంలో లభించే ప్రోత్సాహం తక్కువగా ఉంటోంది. అయినా పీవీ సింధు, మిథాలీ రాజ్, మేరీకోమ్.. వంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది వివిధ క్రీడల్లో అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే సెయిలింగ్ వంటి సాహస క్రీడల్లోకి మహిళలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. వచ్చిన వారికి దక్కే ప్రోత్సాహం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. ఆ ధోరణిని పోగొట్టడానికి ఆర్మీ సాహస విభాగం- సదరన్ కమాండ్ సెయిలింగ్ నోడ్ నడుం బిగించింది. EME భాగస్వామ్యంతో ఆర్మీలోని తొమ్మిది మంది మహిళా అధికారులతో సెయిలింగ్ యాత్రను ప్రారంభించింది. ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులే చేపట్టిన ఈ యాత్ర గురించి మరిన్ని వివరాలు మీకోసం...
మహిళలు వివిధ క్రీడల్లో పాల్గొంటున్నా.. సెయిలింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనడం తక్కువగా చూస్తుంటాం. ప్రత్యేకించి ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్లో ఇంతవరకు మన దేశానికి చెందిన ఒక్క అమ్మాయే పాల్గొనడం ఇందుకు నిదర్శనం. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో చెన్నైకి చెందిన నేత్రా కుమానన్ ఈ పోటీల్లో పాల్గొంది. ఈ నేపథ్యంలో- ఇలాంటి సాహస క్రీడల్లో పాల్గొనేలా అమ్మాయిల్లో స్ఫూర్తి నింపే లక్ష్యంతో ఆర్మీ సాహస విభాగం.. ఈ సెయిలింగ్ యాత్రను ప్రారంభించింది.
ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ- ‘మహిళలు చాలా రంగాల్లో గ్లాస్ సీలింగ్‌ను బద్దలుకొడుతూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో వారు కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ఈ యాత్ర ఆర్మీలోని మహిళా ఆఫీసర్ల శక్తిని తెలియజేస్తుంది. అలాగే సెయిలింగ్‌పై మక్కువ ఉన్న అమ్మాయిల్లో స్ఫూర్తి నింపడమే కాకుండా ఆర్మీలో మహిళల సంఖ్య మరింత పెరగడానికి తోడ్పడుతుంది’ అని చెప్పారు.
తొమ్మిది మంది ధీరలు..!
ఈ యాత్రలో ఆర్మీకి చెందిన తొమ్మిది మంది మహిళా ఆఫీసర్లు పాల్గొంటున్నారు. ఈ బృందానికి మేజర్ ముక్తా గౌతమ్ నాయకత్వం వహిస్తున్నారు. వీరిలో మేజర్లు ప్రియా సెమ్వాల్, ప్రియా దాస్, రష్మిల్ సంగ్వాన్, అర్పిత ద్వివేదీ, సంజనా మిట్టల్‌తో పాటు కెప్టెన్లు జ్యోతీ సింగ్, మల్వికా రావత్, శుభమ్ సోలంకి, సోనాల్ గోయల్‌లు ఉన్నారు. ఈ యాత్ర కోసం మహిళా ఆఫీసర్లు EME సెయిలింగ్ ఆసోసియేషన్‌లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. వీరంతా 44 అడుగుల పొడవు గల బావరియా బోట్ లో చెన్నై నుంచి విశాఖపట్నం వరకు సాగి.. మళ్లీ చెన్నైకు చేరుకుంటారు. ఈ క్రమంలో వారు దాదాపు 900 నాటికల్ మైళ్లు (1700 కిలోమీటర్లు) ప్రయాణిస్తారు. ఈ బృందం 330 నాటికల్ మైళ్ల దూరాన్ని 54 గంటల్లో పూర్తి చేసి గురువారం (ఫిబ్రవరి 17) విశాఖపట్నానికి చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!